కుంభమేళాలో విషాదం.. ఎంతో మంది ప్రాణాలు కాపాడి, ప్రాణాలు వదిలిన పోలీస్..!

కుంభమేళాలో విషాదం ఎంతో మంది ప్రాణాలు కాపాడి, ప్రాణాలు వదిలిన పోలీస్!

పవిత్ర నగరమైన ప్రయాగ్‌రాజ్ లో మహాకుంభమేళా( Mahakumbh Mela ) వేడుక జరుగుతున్న సంగతి తెలిసిందే.

కుంభమేళాలో విషాదం ఎంతో మంది ప్రాణాలు కాపాడి, ప్రాణాలు వదిలిన పోలీస్!

అయితే ఇటీవల తీవ్ర విషాదం చోటుచేసుకుంది.భక్తుల పుణ్యస్నానాలతో పరవశించాల్సిన వేళ.

కుంభమేళాలో విషాదం ఎంతో మంది ప్రాణాలు కాపాడి, ప్రాణాలు వదిలిన పోలీస్!

తొక్కిసలాటతో( Stampede ) ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకొంది.సంగం నోస్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన బారికేడ్లను భారీ సంఖ్యలో జనం ఒక్కసారిగా తోసుకురావడంతో ఈ ప్రమాదం జరిగింది.

నేలపై నిద్రిస్తున్న భక్తులు ఊహించని ఈ ఘటనలో ప్రాణాలు విడిచారు.ఈ దుర్ఘటనలో దాదాపు 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

మృతుల్లో ఉత్తరప్రదేశ్( Uttar Pradesh ) వాసులే 19 మంది ఉండగా, మిగిలిన వారు కర్ణాటక, గుజరాత్, అస్సాం రాష్ట్రాలకు చెందిన వారు.

ఈ ఘోర ప్రమాదంలో ఎంతోమంది భక్తులను కాపాడిన ఒక నిజమైన హీరో ఉన్నాడు.

ఆయనే సబ్-ఇన్‌స్పెక్టర్ అంజనీ కుమార్ రాయ్.( SI Anjani Kumar Rai ) ఘజియాబాద్ జిల్లాలోని బసుఖా, ముహమ్మదాబాద్‌కు చెందిన అంజనీ కుమార్ రాయ్, బహ్రైచ్ పోలీస్ లైన్‌లో పనిచేసేవారు.

మహాకుంభమేళా బందోబస్తు కోసం ప్రయాగ్‌రాజ్‌కు( Prayagraj ) వచ్చారు.తొక్కిసలాట జరిగిన సమయంలో, ఆయన ప్రాణాలకు తెగించి మరీ భక్తులను రక్షించారు.

స్వయంగా రంగంలోకి దిగి అనేకమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. """/" / అయితే, ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో అంజనీ కుమార్ రాయ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

ఒక్కసారిగా నీరసంగా అనిపించడంతో దగ్గరలోని మేళా ఆసుపత్రికి వెళ్లారు.వైద్యులు పరీక్షించి మందులు ఇచ్చి పంపించారు.

కాస్త కుదుటపడ్డాక మళ్లీ తన విధుల్లో చేరారు.కానీ కొద్దిసేపటికే ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు, నోటి నుంచి నురగలు వచ్చాయి.

బహ్రైచ్ నుంచి ఆయనతో వచ్చిన మేనల్లుడు వెంటనే ఆసుపత్రికి తరలించాడు.కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

వైద్యులు అంజనీ కుమార్ రాయ్ మరణించినట్లు నిర్ధారించారు. """/" / సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు.

ప్రమాదంపై విచారణకు జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేశారు.ప్రజలు పుకార్లు నమ్మవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు.

అంజనీ కుమార్ రాయ్ తన ప్రాణాలను లెక్కచేయకుండా ఎంతోమంది భక్తుల ప్రాణాలు కాపాడారు.

ఆయన చేసిన ఈ త్యాగం వెలకట్టలేనిది.నిజమైన హీరో ఎప్పుడూ తన గురించి కాకుండా ఇతరుల గురించే ఆలోచిస్తాడు అనడానికి అంజనీ కుమార్ రాయ్ నిదర్శనం.

ది రాజాసాబ్ మూవీలో నిధి అగర్వాల్ దెయ్యం రోల్ లో కనిపిస్తారా.. అసలు నిజాలివే!