త్వరలోనే ప్రభాస్ పెళ్లి.. దుర్గమ్మ సన్నిధిలో ప్రభాస్ పెద్దమ్మ కామెంట్!
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న నటుడు ప్రభాస్(Prabhas ) ప్రస్తుతం వరస పాన్ ఇండియా సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
ఇలా వరుస సినిమాలను లైన్లో పెట్టిన ప్రభాస్ ఇటీవల కల్కి ( Kalki ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు.
ఇక ప్రభాస్ తన తదుపరి ప్రాజెక్టులకు విషయానికి వస్తే.ఈయన ప్రస్తుతం సలార్ 2, కల్కి 2, రాజా సాబ్, స్పిరిట్, ఫౌజీ వంటి వరుస పాన్ ఇండియా సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.
"""/" /
ఇండస్ట్రీలో ప్రభాస్ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు కానీ ఇప్పటివరకు ఈయన పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉండటమే అభిమానులను ఎంతగానో కలవర పెడుతుంది.
ప్రభాస్ ఇప్పటికే పెళ్లి వయస్సు దాటిపోయిన పెళ్లి ( Marriage ) గురించి మాత్రం ఆలోచించడం లేదు.
ఇక ప్రభాస్ పెళ్లి గురించి తన పెద్దమ్మ శ్యామలాదేవి( Shyamala Devi ) తరచూ మాట్లాడుతూ ఉన్నప్పటికీ ఇప్పటికీ ప్రభాస్ పెళ్లి మాత్రం జరగడం లేదు.
"""/" /
ఇకపోతే తాజాగా మరోసారి ప్రభాస్ పెళ్లి గురించి తన పెద్దమ్మ శ్యామలాదేవి చేసిన వ్యాఖ్యల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దసరా నవరాత్రి ఉత్సవాలలో పురస్కరించుకొని ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు.
ఇలా అమ్మవారి దర్శనం అనంతరం ఈమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు కృష్ణంరాజు గారి దీవెనలు ప్రభాస్ పై ఎప్పుడు ఉంటాయని వీరి ఆశీస్సులతో త్వరలోనే ప్రభాస్ పెళ్లి జరుగుతుందని తెలిపారు.
ఆరోజు తప్పకుండా ప్రతి ఒక్కరిని పేరుపేరునా ఆహ్వానిస్తాము అందుకే సందర్భంగా ప్రభాస్ పెళ్లి గురించి శ్యామల దేవి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గేమ్ ఛేంజర్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్.. డిప్యూటీ సీఎం అంచనాలను పెంచేస్తారా?