ప్రభాస్ పెళ్లి దుస్తులు ఇక్కడే కొంటాం.. శ్యామలాదేవి ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్!

పాన్ ఇండియా హీరో ప్రభాస్( Prabhas ) పెద్దమ్మ దివంగత హీరో రెబల్ స్టార్ కృష్ణం రాజు భార్య శ్యామలా దేవి( Shyamala Devi ) గురించి మనందరికీ తెలిసిందే.

ఈమె పేరు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంటుంది.ఇకపోతే శ్యామల దేవి ఇప్పటికే చాలా సందర్భాలలో చాలా రకాల ఇంటర్వ్యూలలో ప్రభాస్ పెళ్లి గురించి స్పందించిన విషయం తెలిసిందే.

ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అన్న ప్రస్తావన వచ్చిన ప్రతిసారి కూడా త్వరలోనే చేస్తాం,మాకు చేయాలనే ఉంది, కలిసి రాలేదు ఇలా ఎన్నో మాటలు చెబుతూ వచ్చారు.

తాజాగా కూడా ప్రభాస్ పెళ్లి పై స్పందిస్తూ ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

"""/" / కాగా తాజాగా శ్యామలాదేవి నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి( Gadwal Vijayalakshmi ), యువ నటుడు రక్షిత్ అట్లూరితో కలిసి జూబ్లీహిల్స్‌ లో జరిగిన ఒక స్టోర్ ఓపెనింగ్‌కి అతిథిగా వెళ్లారు.

అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.నాకు కంచి పట్టు చీరలంటే చాలా ఇష్టం.

ఈ స్టోర్‌లో చాలా వెరైటీలు ఉన్నాయి.ప్రభాస్‌ పెళ్లికి కూడా ఇక్కడ నుంచే దుస్తులు కొనుగోలు చేస్తాము అని ఆమె తెలిపారు.

ఈ సందర్భంగా శ్యామలాదేవి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

"""/" / షాప్ ఓపెనింగ్ ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇకపోతే ప్రభాస్ విషయానికొస్తే ప్రస్తుతం ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

సినిమాలలో బాగానే రాణిస్తున్న ప్రభాస్ పెళ్లి విషయం వచ్చేసరికి ఎప్పటికప్పుడు మాటలు దాటవేస్తూ వస్తున్నారు.

నాలుగుపదుల వయసు దాటినా కూడా పెళ్లి చేసుకోకుండా ఇంకా బ్యాచిలర్ గానే ఉన్నారు ప్రభాస్.

వీడియో వైరల్: నడిరోడ్డుపై అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని చితకబాదిన యువతులు..