''నా చిన్న హీరో జున్నుమాన్'' అంటూ కొడుకు స్పెషల్ వీడియో షేర్ చేసిన నాని..

నేచురల్ స్టార్ నాని కెరీర్ ఆరు సినిమాలు నాలుగు హిట్లు అన్నట్టుగా సాగుతుంది.

నాని ప్రసెంట్ వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు.ఈ మధ్యనే శ్యామ్ సింగరాయ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

శ్యామ్ సింగరాయ్ నాని కెరీర్ లో మరొక మైలు రాయిలాగా నిలిచి పోయింది.

ఈ సినిమా హిట్ తో నాని ఫుల్ ఖుషీగా ఉన్నాడు.ఇదిలా ఉండగా నాని తన గారాల తనయుడు జున్ను పుట్టినరోజు సందర్భంగా జున్ను మ్యాన్ అంటూ తన తనయుడిని విష్ చేసిన విధానం నెటిజెన్స్ ను ఆకట్టు కుంటుంది.

జున్ను ఐదవ పుట్టిన రోజు సందర్భంగా నాని ఈ వీడియోను షేర్ చేసాడు.

ఇందులో అర్జున్ బ్యాట్ మ్యాన్ డ్రెస్ ధరించి కన్పించాడు.అలాగే నాని కూడా తన కొడుకుతో కలిసి ఉన్న కొన్ని మధురమైన క్షణాలు సంబంధించిన ఫోటోలను కూడా ఈ వీడియోలో కనిపించాయి.

"""/"/ ఈ వీడియో షేర్ చేస్తూ.''నా చిన్న సూపర్ హీరో జున్నుమాన్ కు 5 సంవత్సరాలు'' అంటూ నాని ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడు.

ఈయన ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమా ను తన భార్య, కుటుంబం తో కలిసి వీక్షించాడు.

ఇక నాని సినిమాల విషయానికి వస్తే.ప్రెసెంట్ అంటే సుందరానికి, దసరా సినిమాలతో బిజీగా ఉన్నాడు.

ఈ రెండు సినిమాలు షూటింగ్ జరుపు కుంటున్నాయి.శ్రీకాంత్ ఓడేలా దర్శకత్వంలో తెరకెక్కే 'దసరా' సినిమాలో ఇప్పటి వరకు నాని ని చూడని కొత్త లుక్ లో కనిపించనున్నాడు.

ఇందులో కీర్తి సురేష్ కథానాయికగా కనిపించ నుంది.గోదావరి ఖని లోని బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ మాస్ ఎంటర్టైనర్ ను శ్రీ లక్ష్మి వెంకటేశ్వర బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి వేగంగా పూర్తి కూడా చేస్తున్నాడు.ఈ సినిమాలో నాని తెలంగాణ యాసలో మాట్లాడి త్రిల్ చేయబోతున్నాడు.

పవన్ కళ్యాణ్ పేరు తలుచుకుంటే చాలు ఆక్సిజన్ లభిస్తుంది: చంద్ర బోస్