ఆసుపత్రిలో చేరిన శుబ్ మన్ గిల్.. పాక్ తో మ్యాచ్ కూడా డౌటే..!
TeluguStop.com
భారత స్టార్ ఓపెనర్ శుబ్ మన్ గిల్( Shubman Gill ) డెంగ్యూ జ్వరం కారణంగా ప్లేట్ లెట్స్ తక్కువగా ఉండడంతో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఈ బుధవారం జరిగే భారత్- ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ కు ఇప్పటికే గిల్ దూరమయ్యాడు.
అయితే శనివారం జరగనున్న భారత్- పాకిస్తాన్ మ్యాచ్ కూడా గిల్ దూరం అయ్యే అవకాశం కనిపిస్తోంది.
గిల్ స్థానంలో ఓపెనర్ గా రోహిత్ శర్మ( Rohit Sharma ) తో కలిసి ఇషాన్ కిషన్ బరిలోకి దిగనున్నాడు.
"""/" /
తాజాగా బీసీసీఐ గిల్ హెల్త్ అప్డేట్ ను విడుదల చేసింది.
భారత జట్టుతో కలిసి గిల్ ఢిల్లీకి వెళ్లలేదని, చెన్నైలో ఉండే ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడని తెలిపింది.
డెంగ్యూ ఫీవర్ కారణంగా గిల్ ప్లేట్ లెట్స్ తగ్గిపోవడంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది.
గతవారం గిల్ కు డెంగ్యూ ఫీవర్ రిపోర్ట్ పాజిటివ్ గా వచ్చింది.అందుకే భారత్ ఆడే తొలి మ్యాచ్ లో గిల్ ఆడలేదు.
అయితే భారత్- పాకిస్తాన్ మ్యాచ్ వరకు గిల్ కోలుకొని ఫిట్ గా ఉంటాడని బీసీసీఐ( BCCI ) భావించింది.
కానీ డెంగ్యూ లాంటి ఫీవర్ నుంచి కోలుకోవడానికి కనీసం అంటే రెండు వారాల సమయం పడుతుంది.
ఇటువంటి పరిస్థితులలో గిల్లు వచ్చే వారం ప్రారంభంలో మాత్రమే ప్రాక్టీస్ కు తిరిగి వచ్చే అవకాశం ఉంది.
ఈ వారంలో జరిగే మ్యాచ్ లలో గిల్ ఆడే అవకాశం కనిపించడం లేదు.
"""/" /
ఈ ఏడాది వన్డేల్లో భారత తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా శుబ్ మన్ గిల్ నిలిచాడు.
అయితే ప్రపంచ కప్ లో గిల్ భారతదేశానికి అతిపెద్ద గేమ్ చేంజర్ గా నిరూపించగలడు.
ఎన్నో సరికొత్త రికార్డులను సృష్టించి తన ఖాతాలో వేసుకునే సమయంలో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ ఉండడంతో అభిమానులు కాస్త ఆందోళనలో ఉన్నారు.
గిల్ త్వరగా కోలుకొని భారత జట్టు లో చేరాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.
మెగా హీరోలకు పోటీగా నందమూరి హీరోలు… లెక్క పెరుగుతుందిగా!