T20 క్రికెట్‌లో 3 రికార్డులు బ్రేక్ చేసిన శుభ్‌మన్ గిల్‌!

ఈ మధ్య శుభ్‌మన్ గిల్‌ పేరు బాగానే వినబడుతోంది.దానికి కారణం న్యూజిలాండ్‌తో జ‌రిగిన 3వ T20 మ్యాచ్‌.

ఈ మ్యాచ్‌లో సెంచ‌రీతో చెలరేగిపోయాడు శుభ్‌మ‌న్‌.కేవలం 63 బంతుల్లోనే 126 ర‌న్స్ చేసి ఇండియాకు ఘ‌న విజ‌యాన్ని కానుకగా ఇచ్చాడు.

ఈ మ్యాచ్ ద్వారా T20 క్రికెట్‌లో ప‌లు రికార్డుల‌ను శుభ్‌మ‌న్‌ నెలకొల్పిన సంగతి విదితమే.

ఇక ఈ బుధ‌వారం న్యూజిలాండ్‌తో జ‌రిగిన 3వ T20 మ్యాచ్‌లో చేసిన సెంచ‌రీ శుభ్‌మ‌న్‌ జీవితంలోనే ఓ అరుదైన ఘనతగా చెప్పుకోవచ్చు.

"""/"/ ఈ గెలుపుతో మూడు T20 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో టీమ్ ఇండియా కైవసం చేసుకుంది.

ఈ మ్యాచ్‌లో 54 బాల్స్‌లోనే శుభ్‌మ‌న్ గిల్ మూడంకెల స్కోరును అందుకోవడం విశేషంగా చెప్పుకోవచ్చు.

మొత్తంగా 63 బంతుల్లో 7 సిక్స‌ర్లు, 12 ఫోర్ల‌తో 126 ర‌న్స్ చేసిన గిల్ నాటౌట్‌గా నిలిచి రికార్డు సాధించాడు.

ఈ ఫాస్టెస్ట్ సెంచ‌రీతో T20ల్లో ప‌లు రికార్డుల‌ను శుభ్‌మ‌న్ గిల్ తిరగరాసినట్టు అయింది.

మూడు ఫార్మెట్ల‌లో సెంచ‌రీ చేసిన 5వ ఇండియ‌న్ ప్లేయ‌ర్‌గా శుభ్‌మ‌న్ గిల్ రికార్డ్ క్రియేట్ చేశాడు.

"""/"/ ఈ జాబితాలో విరాట్ కోహ్లి, రోహిత్‌శ‌ర్మ‌, కె.ఎల్ రాహుల్‌, సురేష్ రైనా తరువాత శుభ్‌మ‌న్‌ ఉన్నారు.

ఇంట‌ర్నేష‌నల్ T20 క్రికెట్‌లో సెంచ‌రీ చేసిన అతి పిన్న వ‌య‌స్కుడైన భార‌త క్రికెట‌ర్‌గా శుభ్‌మ‌న్‌ రికార్డులు నెలకొల్పాడు.

గ‌తంలో ఈ రికార్డ్ సురేష్ రైనా పేరు మీద ఉండగా ఇపుడు దానిని మనోడు తిరగ రాశాడు.

బుధ‌వారం జ‌రిగిన టీ20 మ్యాచ్‌లో శుభ్‌మ‌న్ గిల్ 23 సంవ‌త్స‌రాల 146 రోజుల్లోనే సెంచ‌రీ చేసి రైనా రికార్డ్‌ను అధిగ‌మించాడు.

అలాగే విరాట్ కోహ్లి, రోహిత్ శ‌ర్మ త‌ర్వాత టీ20 క్రికెట్‌లో సెంచ‌రీ చేసిన మూడో భార‌త ఓపెన‌ర్‌గా శుభ్‌మ‌న్ గిల్ రికార్డ్ నెల‌కొల్పాడు.

పాన్ ఇండియా సక్సెస్ కొట్టడానికి ట్రై చేస్తున్న స్టార్ డైరెక్టర్…