ఆమెతో శృతి కలిపేందుకు పవన్ రెడీ..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసగా సినిమాలను లైన్‌లో పెడుతున్నాడు.ఇప్పటికే బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న పవన్, డైరెక్టర్ క్రిష్‌తో కలిసి మరో సినిమాను చేయనున్నాడు.

ఇక ఇదిలా ఉండగానే మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్‌లో కూడా ఓ సినిమాను పవన్ అనౌన్స్ చేశాడు.

అయితే ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులను దర్శకుడు హరీష్ శంకర్ చాలా జాగ్రత్తగా చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్‌గా గబ్బర్ సింగ్ బ్యూటీ శృతి హాసన్‌ను మరోసారి తీసుకోవాలని హరీష్ భావిస్తున్నాడట.

గతంలో వపన్-శృతిహాసన్ కలిసి నటించిన గబ్బర్‌సింగ్, కాటమరాయుడు సినిమాల్లో వారి మధ్య కెమిస్ట్రీ బాగా రావడంతో ప్రేక్షకులు వీరి కాంబోను మరోసారి చూడాలని కోరుకుంటున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

కాగా చాలా గ్యాప్‌ తరువాత శృతి హాసన్ ఇటీవల తెలుగులో రవితేజ సరసన క్రాక్ అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.

మరి పవన్‌తో ముచ్చటగా మూడాసారి ఈ బ్యూటీ నటిస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.

రేపటితో ముగియనున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్