Shruti Haasan : ప్రేమ అంటే మాయా ఊబి.. హీరోయిన్ శృతి హాసన్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

shruti haasan : ప్రేమ అంటే మాయా ఊబి హీరోయిన్ శృతి హాసన్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

కమలహాసన్ కూతురు శృతిహాసన్ గురించి మనందరికీ తెలిసిందే.కమలహాసన్ కూతురుగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.

shruti haasan : ప్రేమ అంటే మాయా ఊబి హీరోయిన్ శృతి హాసన్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

టాలీవుడ్ తో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా నటించి మెప్పించింది.తెలుగులో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రవితేజ లాంటి స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది.

shruti haasan : ప్రేమ అంటే మాయా ఊబి హీరోయిన్ శృతి హాసన్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

ఇది ఇలా ఉంటే గత కొద్ది రోజులుగా శృతిహాసన్ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతూనే ఉంది.

తరచూ ఏదోక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. """/" / తాజాగా మరోసారి ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవ్వడంతో శృతి హాసన్( Shruti Haasan ) పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

జీవితంలో గాఢంగా ప్రేమించిన ఒక వ్యక్తితో ఉన్న అనుబంధం, జీవితం, ప్రేమలో వైఫల్యం.

వీటన్నింటినీ నా నాలుగు నిమిషాల వీడియో సాంగ్‌లో చెప్పాలనుకున్నాను.ముందు ఈ సాంగ్‌ని నా పియానో మీద ఇంగ్లిష్‌లో రాసుకున్నాను.

ప్రస్తుత జనరేషన్‌ మనస్తత్వాన్ని దృష్టిలో పెట్టుకొని రూపొందించాను.నా ఉద్దేశంలో ప్రేమ ఒక మాయా లోకం.

పంచదార ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసినా షుగర్‌ క్యాండీలను ఇష్టంగా తింటాం.ప్రేమ కూడా అంతే.

అదొక మాయా ఊబి. """/" / ఇనిమెల్‌( Inimel ) లో దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌( Lokesh Kanagaraj ) ఒక నటుడిగా కనిపిస్తారు.

మెగాఫోన్‌ పట్టుకునే తను తెరపై కనిపిస్తుండటంతో సహజంగానే జనాల్లో ఆసక్తి ఉంటుంది.తను పెద్ద దర్శకుడైనా అణకువగా ఉండే వ్యక్తి.

తనతో కలిసి పనిచేయడం చాలా సంతోషం ఉంది.దర్శకత్వంలో తను ఎంత క్రియేటివ్‌గా ఉంటాడో తెలుసు.

కానీ ఇంత బాగా నటిస్తాడని అనుకోలేదు.తొమ్మిది వేర్వేరు లొకేషన్లలో మూడు రోజుల్లో దీన్ని చిత్రీకరించాం.

అంత కష్టమైన షెడ్యూల్‌లోనూ తనలో కొంచెమైనా విసుగు లేదు. నాన్న అనే ఒక్క కారణంతోనే కలిసి పని చేయడం లేదు.

ఆయన గొప్పగా రాస్తారు.కష్టపడి పని చేస్తారు.

ఈ వీడియో సాంగ్‌ కోసం నాకు పది రకాల లిరిక్స్‌ ఇచ్చారు.ఆయన రాసిన వాటిలో ఇదెలా ఉంది? అదెలా ఉంది? అని అడుగుతారే తప్ప ఇదే బాగుందని చెప్పరు.

అందుకే నాన్నతో కలిసి పని చేయడాన్ని గౌరవంగా భావిస్తాను.విదేశీ కళాకారులతో కలిసి పని చేయడాన్ని నేను చాలా ఎంజాయ్‌ చేస్తాను.

అక్కడి కథలు సౌకర్యవంతంగా ఉంటాయి అని తెలిపింది శృతి హాసన్.

ఫాంటా గుట్టు రట్టు.. ఇండియాలో కల్తీనా? ఇతర దేశాల్లో ఒకలా.. ఇక్కడ ఒకలా?

ఫాంటా గుట్టు రట్టు.. ఇండియాలో కల్తీనా? ఇతర దేశాల్లో ఒకలా.. ఇక్కడ ఒకలా?