నా ఒంటరితనాన్ని ప్రేమిస్తున్నాను.... ఇప్పటికీ ఆ విషయం అర్థమైంది: శృతిహాసన్
TeluguStop.com
సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రెటీలు ప్రేమించుకోవడం పెళ్లిళ్లు చేసుకుని విడిపోవడం వంటివి సర్వసాధారణం కొందరు పెళ్లి చేసుకున్నాక విడిపోతే మరికొందరు ప్రేమలో ఉంటూనే బ్రేకప్ చెప్పుకుంటారు.
ఇలాంటి కోవకే చెందుతారు నటి శృతిహాసన్.కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతిహాసన్ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
అయితే ఈమె గతంలో లండన్ కి చెందిన ఓ వ్యక్తితో ప్రేమలో పడ్డారు.
ఇక వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వచ్చిన అనంతరం కొన్ని కారణాలవల్ల వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు.
ఇలా తన మొదటి ప్రియుడుతో బ్రేకప్ చెప్పుకున్న శృతిహాసన్ అనంతరం ముంబైకి చెందిన డూడుల్ ఆర్టిస్ట్ శంతను హజారికతో ప్రేమలో పడింది.
ఇతనితో కలిసి సహజీవనం చేస్తూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన శృతిహాసన్ నిత్యం తన ప్రియుడుతో కలిసి ఉన్న ఫోటోలు వీడియోలను షేర్ చేస్తూ ఉండేది.
అయితే తాజాగా ఈమె తన ప్రియుడు శంతనుతో కూడా బ్రేకప్ చెప్పుకున్నారని తెలుస్తోంది.
తాజాగా శృతిహాసన్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్ట్ వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారని వార్తలకు బలం చేకూరుస్తున్నాయి.
"""/"/
సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే శృతిహాసన్ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.
ఈ క్రమంలోనే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా పోస్ట్ షేర్ చేస్తూ నాతో నేను ఉంటేనే సంతోషం.
నా విలువైన సమయాన్ని ఒంటరితనాన్ని ప్రేమిస్తున్నాను.జీవితంలో ఈ స్థాయి వరకు రావడమే గొప్ప.
అందుకు థాంక్స్ ఎట్టకేలకు నాకు ఈ విషయం అర్థమైంది అంటూ ఈ సందర్భంగా శృతిహాసన్ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.
దీంతో ఈమె తన ప్రియుడుకు బ్రేకప్ చెప్పుకున్నారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ఆ మూవీ కోసం యశ్ పారితోషికం అన్ని వందల కోట్లా.. ఈ విషయంలో రికార్డ్ అంటూ?