ప్రేమ పెళ్లిపై నోరు విప్పిన శృతి హాసన్.. ఏం చెప్పిందంటే?

టాలీవుడ్ బ్యూటీ శృతిహాసన్ ప్రస్తుతం రీ ఎంట్రీ తో పలు సినిమాలలో బిజీగా ఉంది.

తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్న శృతిహాసన్ అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా నిలిచింది.

హీరోయిన్ గానే కాకుండా సింగర్ గా కూడా మంచి పేరు సంపాదించుకుంది.పలు సినిమాలలో పాటలు పాడి వినిపించింది.

తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా నటించింది.ఇక సోషల్ మీడియాలో కూడా బాగా బిజీగా ఉంటుంది.

ఇదిలా ఉంటే తాజాగా తన ప్రేమ పెళ్లి గురించి నోరు విప్పింది.గతంలో శృతిహాసన్ ఓ ఫోటో గ్రాఫర్ తో ప్రేమలో ఉండగా వారి మధ్య మనస్పర్థలు రావడంతో అతడికి బ్రేకప్ చెప్పింది.

ఆ కారణంగా కొన్ని ఏళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉండగా మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది.

ఇక మరోసారి గూగుల్ పెయింట్ ఆర్టిస్ట్ శాంతను హజారికాతో ప్రేమలో పడింది.ఇక ఈ విషయం గురించి సోషల్ మీడియా వేదికగా, మీడియా వేదికగా ప్రకటించింది.

పైగా అతడినే పెళ్లి చేసుకుంటానని తెలిపింది. """/"/ ప్రస్తుతం అతనితో డేటింగ్ లో ఉండగా అతడితో దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా బాగా పంచుకుంటుంది.

ఇదిలా ఉంటే తాజాగా తన పెళ్లి గురించి కొన్ని విషయాలు పంచుకుంది.శంతన్ తనకు మంచి స్నేహితుడని.

తమ ఇద్దరి అభిరుచులు ఒకటేనని తెలిపింది.కళలు, సంగీతం పట్ల అవగాహన ఉందని.

అందుకే అతనితో సమయం గడపడానికి ఇష్టపడతానని తెలిపింది.అన్ని అంశాలలో పర్ఫెక్ట్ మ్యాచ్ అని.

పెళ్లి విషయంలో ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనిపిస్తే అప్పుడు పెళ్లి చేసుకుంటాను అని తెలిపింది.

అంతేకాకుండా మీడియాకు కూడా ముందుగానే చెబుతాను అని ప్రకటించింది.ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమాలో బిజీగా ఉంది.

ఈ న్యాచురల్ టానిక్ ను వాడితే మీ పల్చటి జుట్టు దట్టంగా మారడం పక్కా!