టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్( Shruti Haasan ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
కమల్ హాసన్ కూతురుగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకుంది.
కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా సింగర్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
టాలీవుడ్ లో మహేష్ బాబు, అల్లు అర్జున్ ప్రభాస్, లాంటి స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.
ఇకపోతే ఈమె తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. """/" /
ఈమెకు సంబంధించిన వార్తలు కూడా తరచుగా సోషల్ మీడియా( Social Media )లో వైరల్ అవుతూ ఉంటాయి.
ఇక సోషల్ మీడియాలో ఎవరు ఎన్ని విధాలుగా కామెంట్స్ చేసినా నెగిటివ్ గా మాట్లాడినా కూడా అవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళుతూ ఉంటుంది శృతిహాసన్.
ఒకరికి నచ్చేలా కాకుండా తనకు నచ్చినట్లుగా ఉంటుంది.ఇది ఇలా ఉంటే తాజాగా ఈమె తన ఫ్యాన్స్‌తో చిట్‌చాట్ నిర్వహించింది.
ఈ క్రమంలో తనకు ఎదురైన ప్రశ్నపై అసహనం వ్యక్తం చేసింది.సౌత్ ఇండియన్ యాసలో ఏదైనా చెప్పవా? అని ఓ నెటిజన్ అడగ్గా.
అందుకు శృతి ఇలా రియాక్ట్ అయింది. """/" /
ఓకే ఈ రకమైన జాతి వివక్షను నేను అస్సలు సహించను.
మమ్మల్ని చూసి ఇడ్లీ, దోస, సాంబార్.ఇలాంటి పేర్లతో పిలిస్తే మేము ఊరుకోలేము.
మీరు మమ్మల్ని అనుకరించలేరు.కాబట్టి మాలాగా ఉండాలని ట్రై చేయకండి.
ఎలా పడితే అలా పిలిస్తే దాన్ని కామెడీగా తీసుకోము.సౌత్ ఇండియన్ భాషలో ఏదైనా చెప్పమేని అడిగావు కదా నోరు మూసుకుని వెళ్లు అని తమిళంలో రాసుకొచ్చింది.
ఇక ఆ కామెంట్ పై స్పందిస్తూ చాలా బాగా బుద్ధి చెప్పారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.