సంచలనంగా మారిన శృతి హాసన్ పోస్ట్.. అలాంటి వారి పక్కన ఉండడం డేంజర్ అంటూ?
TeluguStop.com
విశ్వనటుడు కమలహాసన్ కూతురు శృతిహాసన్( Shruti Haasan ) గురించి మనందరికీ తెలిసిందే.
కమలహాసన్ కూతురుగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.
టాలీవుడ్ తో ఇతర భాషల్లో కూడా నటించి మెప్పించింది.తెలుగులో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రవితేజ లాంటి స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది.
ఇది ఇలా ఉంటే గత కొద్ది రోజులుగా శృతిహాసన్ తన సోషల్ మీడియా ఖాతాలో చేసిన పోస్టులు వైరల్ గా మారాయి.
26వ తేదీని ఏదో స్పెషల్ ప్రకటన ఉందని ఊరిస్తూనే ఉంది. """/" /
26వ తేదీ ఒక విషయాన్ని ప్రకటిస్తాను అంటూ తన ఇంస్టాగ్రామ్ క్రైమ్ స్టోరీ లో రాసుకొచ్చింది.
కొందరు తన పెళ్లి విషయం గురించి అంటూ కామెంట్స్ చేస్తుండగా మరికొందరు తన ప్రెగ్నెంట్ విషయం గురించి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
నిన్న మొన్నటి వరకు కూడా శృతిహాసన్ ప్రెగ్నెంట్ అని ఆ విషయాన్నీ 26వ తేదీ ప్రకటించబోతోంది అంటూ వార్తలు జోరుగా వినిపించాయి.
ఇకపోతే తాజాగా ఆమె ఇన్ స్టా స్టోరీలో పెట్టిన పోస్ట్ ని బట్టి చూస్తే ఆమె ఎవరి చేతులోనైనా మోసపోయిందా? అనే అనుమానం కలగక మానదు.
ఇంతకీ శృతి హాసన్ ఆ పోస్ట్ లో ఏమి రాసుకొచ్చింది అంటే.క్రియేటివ్ పీపుల్స్ ( Creative People )ఎప్పుడైతే క్రియేటివ్ లేని జనాలు చుట్టూ ఉంటారో,అప్పుడు వారు డేంజర్‌లో ఉన్నట్టే.
"""/" /
క్రియేటివ్ పీపుల్స్ ఆలోచనలు ఎప్పుడు కాజేయబడతాయో.వారు ఆ ఐడియాలు ఎప్పుడు కొట్టేస్తారో కూడా తెలీదు అన్నట్టుగా రాసుకొచ్చింది.
ఆ పోస్ట్ ను బట్టి చూస్తే శృతిహాసన్ ఎవరి చేతిలోనో దారుణంగా మోసపోయిందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ ముద్దుగుమ్మ సినిమాల విషయానికి వస్తే.శ్రుతి హాసన్ ఈ ఏడాది ప్రారంభంలో వీర సింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
ఈ రెండు సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది.అయితే ఈ సినిమాలు హిట్టైనా కూడా ఆ తరువాత అవకాశాలు మాత్రం రాలేదు.
తన ఖాతాలో హిట్టు పడ్డా కూడా ఆఫర్లు రాకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.దాంతో ఇప్పుడు శ్రుతి హాసన్ తన భారం అంతా సలార్ సినిమాపై పెట్టుకుంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు తీపికబురు.. వార్2 సినిమా నుంచి ఫస్ట్ లుక్ అప్పుడేనా?