లస్ట్ స్టోరీస్ తెలుగు వెబ్ సిరీస్ లో శృతి హాసన్, రానా రొమాన్స్
TeluguStop.com
కరోనా లాక్ డౌన్ తర్వాత వెబ్ సిరీస్ లకి డిమాండ్ ఎక్కువగా పెరిగింది.
డిజిటల్ ఎంటర్టైన్మెంట్ చూసేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది.థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలియదు.
తెరిచినా గతంలో ఉన్నంత డిమాండ్ ఉంటుందో లేదో తెలియదు.గతంలో మాదిరి గుంపులుగా ప్రయాణించే పరిస్థితి ఇప్పుడు కరోనా కారణంగా లేకుండా పోయింది.
కరోనా థియేటర్లు ఓపెన్ చేసిన కరోనా వాక్సిన్ వచ్చే వరకు ఆ భయం వెంటాడుతూనే ఉంటుంది.
ఈ నేపధ్యంలో సినిమా తారలు కూడా మూవీలు చేస్తూనే తమ మార్కెట్ పెంచుకోవడం కోసం వెబ్ సిరీస్ లవైపు ఆసక్తి చూపిస్తున్నారు.
హీరోయిన్స్ అందరూ ఇప్పటికే ఈ దారిలోకివచ్చేశారు.ఇదిలా ఉంటే ఇప్పుడు దగ్గుబాటి రానా కూడా ఒక వెబ్ సిరీస్ లో సందడి చేయబోతున్నాడు.
అది కూడా శృతి హాసన్ లాంటి అందాల భామతో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతున్నాడు.
ప్రముఖ ఓటీటీ ప్లేయర్ నెట్ ఫ్లిక్స్ హిందీలో సూపర్ హిట్ అయిన లస్ట్ స్టోరీస్ లో ఒక కథలో శృతి హాసన్ లీడ్ రోల్ లో నటిస్తున్నాడు.
ఈ ఎపిసోడ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.ఈ వెబ్ సీరీస్ లో శ్రుతిహాసన్ తో పాటు హీరో రానా దగ్గుబాటి కూడా నటిస్తున్నట్టు తాజా సమాచారం.
శృతి హాసన్ తో ఒక ఎపిసోడ్ లో రానా చేసే సందడి ప్రేక్షకులకి వినోదం అందిస్తుందని టాక్.
మరి ఈ వార్తలలో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే అధికారికంగా రానా, శృతి హాసన్ స్పందించే వరకు వేచి చూడాలి.
ఈ ఏడాది పెద్ద విజయాలు సాధించిన చిన్న సినిమాలివే.. రికార్డులు క్రియేట్ అయ్యయిగా!