సోషల్ మీడియాలో అలాంటి పోస్ట్ చేసిన శృతిహాసన్.. అదే జీవితం కాదంటూ?
TeluguStop.com
తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరోయిన్ శృతిహాసన్( Shruti Haasan ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
ఈ ఏడాది ఆరంభంలో వాల్తేరు వీరయ్య( Waltair Veerayya Movie ) వీర సింహారెడ్డి సినిమాలతో ప్రేక్షకులను పలకరించింది శృతిహాసన్.
ఈ రెండు సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ లను తన ఖాతాలో వేసుకుంది.
ఈ రెండు సినిమాల తరువాత ఈ ముద్దుగుమ్మకు వరుసగా అవకాశాలు వస్తాయని ప్రేక్షకులు భావించారు.
కానీ ఆశించిన విధంగా ఈమెకు అవకాశాలు రాలేదు.కాగా ఈమె ప్రభాస్ సరసన సలార్ నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తి అయ్యింది. """/" /
దాంతో ప్రస్తుతం శృతిహాసన్ చేతిలో ఎటువంటి సినిమాలు లేవు.
ఇది ఇలా ఉంటే కెరియర్ పరంగా ఈ ముద్దుగుమ్మ ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.
తరచూ తనకు తన బాయ్ ఫ్రెండ్ కి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పలు రకాల పోస్టులతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.ఇది ఇలా ఉంటే తాజాగా శృతిహాసన్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది.
ఆ పోస్ట్ లో ఆమె ఈ విధంగా రాసుకొచ్చింది. """/" /
ప్రతీ రోజూ యుద్దం చేయడం కాదు.
ఇంట్లో సరదగా కూర్చుని స్నాక్స్ తింటూ.మన పెట్‌లను ప్రేమగా చూసుకోవాలి.
క్లారాతో ఆటలు ఆడుతూ ముద్దులు పెడుతూ నా ఒళ్లో కూర్చోబెట్టుకోవడం కూడా ఇంపార్టెంట్ అని నేను రియలైజ్ అయ్యాను అని చెప్పుకొచ్చింది శృతి హాసన్.
అందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తన బాయ్ ఫ్రెండ్ శాంతను హజారిక( Santanu Hazarika )తో కలిసి ఉంటున్న విషయం తెలిసిందే.
ఇద్దరు కలిసి గత కొన్నేళ్లుగా ముంబైలో ఒకే ఫ్లాట్ లో కలిసి నివసిస్తున్నారు.
కరోనా సమయంలోనూ ఇద్దరూ కలిసి ఉన్నారు.అక్షర హాసన్ కూడా అప్పుడప్పుడు వీరిద్దరితోనే ఆ ఫ్లాట్‌లో కనిపిస్తూ ఉంటుంది.
బాలయ్య బోయపాటి మూవీలో స్టార్ హీరోయిన్ కూతురు.. ఆ పాత్రలో కనిపిస్తారా?