ప్రభాస్ ను అసలు నమ్మకూడదు… శృతిహాసన్ షాకింగ్ కామెంట్స్?
TeluguStop.com
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్( Prabhas ) ప్రస్తుతం సలార్ ( Salaar ) సినిమా ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
ఈ సినిమా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి అన్ని ప్రాంతాలలోనూ ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇక ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా శృతిహాసన్ ( Shruthi Hassan ) నటించిన సంగతి తెలిసిందే.
అయితే వీరిద్దరి కాంబినేషన్లో ఉన్నటువంటి సన్నివేశాలు చాలా తక్కువ అయినప్పటికీ వీరిద్దరి పాత్ర మాత్రం అందరిని ఆకట్టుకుంది.
ఇక సలార్ సినిమా మంచి సక్సెస్ కావడంతో చిత్ర బృందం ప్రమోషన్లలో కూడా పాల్గొంటూ సందడి చేస్తున్నారు.
"""/" /
ఇక శృతిహాసన్ బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేస్తున్న విషయం మనకు తెలిసిందే.
అయితే ఒక సందర్భంలో శృతిహాసన్ ప్రభాస్ గురించి మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.
ప్రభాస్ ను ఎవరు కూడా నమ్మకూడదు అంటూ ఈమె చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ప్రభాస్ తెర ముందు ఒకలా ఉంటారు తెర వెనుక మరోలా ఉంటారని ఈమె ప్రభాస్ గురించి తెలిపారు.
"""/" /
ప్రభాస్ కెమెరా స్విచ్ ఆన్ చేసే వరకు కూడా అందరితో చాలా సరదాగా మాట్లాడుతూ అందరిని నవ్విస్తూ ఉంటారు అయితే ఒకసారి కెమెరా ఆన్ అయిన తర్వాత తన పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తారని ఎమోషనల్ సన్నివేశాలలో కూడా అలాగే ఒదిగిపోయి నటిస్తారని శృతిహాసన్ తెలిపారు.
ఇక యాక్షన్ సన్నివేశాలలో కూడా ఈయన నటించే సమయంలో పూనకాలు వచ్చినట్టు ఊగిపోతూ ఉంటారని ప్రభాస్ మల్టీ టాలెంట్ అంటూ ఈ సందర్భంగా ప్రభాస్ గురించి శృతిహాసన్ చేసినటువంటి ఈ కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇదేం పైత్యం రా బాబు.. పక్కటెముకలు తీయించుకుని అందులో పెట్టుకుంటుందట..?