Shriya Saran : పండగ పూట చాలా పద్ధతిగా కనిపించిన శ్రేయ… ట్రెడిషనల్ లుక్ లో సందడి చేసిన నటి?

దివాళి పండుగ సందర్భంగా సెలబ్రెటీలందరూ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున దీపావళి సెలబ్రేషన్స్( Diwali Celebrations ) నిర్వహిస్తూ ఉన్నారు.

ఇప్పటికే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఫాలోవర్స్ ను సెలబ్రిటీలు దీపావళి సెలబ్రేషన్స్ లో భాగంగా అందరినీ ఇన్వైట్ చేసి ఘనంగా దీవాలి సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు.

ఈ క్రమంలోనే సెలబ్రెటీలు అందరూ కూడా ఫెస్టివల్ మూడ్ లో ఉన్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే దీపావళి (Deepavali ) పండుగ సందర్భంగా సీనియర్ సినీనటి శ్రేయ (Shreya ) తన ఫ్యామిలీతో కలిసి చాలా ట్రెడిషనల్ గా తయారయ్యి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

"""/" / ఎన్నో సినిమాలలో హీరోయిన్గా నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి శ్రేయ ఇప్పటికీ కెరియర్ పరంగా పలు సినిమాలు వెబ్ సిరీస్లలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

ఇలా ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు తన వ్యక్తిగత జీవితంలో కూడా ఈమె ఎంతో సంతోషంగా ఉన్నారు.

ఈ విధంగా శ్రేయ తరచూ తన భర్త ఆండ్రు తన కుమార్తె రాధ( Radha ) తో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో( Social Media ) షేర్ చేస్తూ ఉంటారు దాదాపు నాలుగు పదుల వయసు దాటిపోతున్నప్పటికీ కూడా శ్రేయ ఇంకా పడుచు పిల్లలాగే పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ ఫోటోలకు ఫోజులిస్తూ ఉంటారు.

"""/" / అదేవిధంగా తరచు ఈమె బీచులలో బికినీ వేసి గ్లామర్ షో చేస్తూ తన భర్త కూతురితో కలిసి ఈమె చేసే సందడి మామూలుగా ఉండదు.

ఇలా ఎప్పటికప్పుడు గ్లామర్ షో చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చే శ్రేయ తాజాగా సాంప్రదాయబద్ధమైనటువంటి చీర ధరించి చాలా అందంగా ముస్తాబయి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు తన కుమార్తె కూడా గాగ్రాలో ఎంతో ముద్దుగా కనిపిస్తున్నారు.

ఇలా తన భర్త కూతురితో కలిసి ఈమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

"""/" / ఇక తన కుమార్తె పింక్ కలర్ గాగ్రా ధరించి ఎంతో చూడముచ్చటగా కనిపించారు.

ఇలా ఈ తల్లి కూతుర్లు ఇద్దరు కూడా ఒకరిపై మరొకరు ఎంతో ప్రేమను చూపించుకుంటూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది నేటిజన్స్ ఈ ఫోటోలపై స్పందిస్తూ.

ఎంతో అందమైన ఫ్యామిలీ చాలా క్యూట్ గా ఉన్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇలా మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని ఎప్పటికీ మీ సంతోషం ఇలాగే ఉండాలి అని కామెంట్లు చేస్తున్నారు.

మరికొందరు రాధమ్మ చాలా సూపర్ గా ఉన్నారు అంటూ శ్రేయ కూతురు పట్ల కూడా ప్రశంసల కురిపిస్తున్నారు ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

రూ.90 వేల ఐఫోన్‌ 16 కేవలం రూ.27 వేలకే కొనేసిన ఘనుడు.. ఎలా అంటే?