ఈ ఫొటోలో కనిపిస్తున్న బుడ్డది ఎవరో గుర్తుపట్టరా.. ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్!

సోషల్ మీడియా వాడకం పెరిగిపోవడంతో సెలబ్రిటీలకు, అభిమానులకు మధ్య ఉన్న వ్యత్యాసం చాలా వరకు తగ్గింది.

సామాన్యులు తమ అభిమాన సెలబ్రిటీలకు ఈ సోషల్ మీడియా ద్వారా మరింత దగ్గరయ్యారు.

సెలబ్రిటీలు కూడా వారి వ్యక్తిగత విషయాలకు సంబంధించి, వారి సినిమాలకు సంబంధించిన విషయాల గురించి తమ అభిమానులతో పంచుకోవడానికి ఆసక్తిని చూపిస్తున్నారు.

సెలబ్రిటీలకు అభిమానులకు సోషల్ మీడియా అన్నది ఒక వారదిగా మారింది అని చెప్పవచ్చు.

ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా త్రోబ్యాక్ పిక్స్ ట్రెండింగ్ నడుస్తోంది.చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక సెలబ్రిటీకు సంబంధించిన త్రో బ్యాక్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే తాజాగా సోషల్ మీడియాలో ఒక స్టార్ హీరోయిన్ కు సంబంధించిన చైల్డ్ హుడ్ ఫోటో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫోటోలో ఉన్న ఈ ముద్దుగుమ్మ తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇక ఫోటోలో తన తల్లితో కలిసి, ఆ చిన్నారి తన అన్న పై గుర్రమెక్కిన విధంగా ఫోటోలకి ఫోజులు ఇచ్చింది.

మరి ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్ మరెవరో కాదు శ్రియా శరన్.ఫోటోలో చూడడానికి ముద్దుముద్దుగా క్యూట్ గా కనిపిస్తున్న ఈ చిన్నారి శ్రియ శరన్.

తెలుగు సినీ ఇండస్ట్రీలో అగ్రహీరోల సరసన కొంతకాలం పాటు ఒక వెలుగు వెలిగింది.

"""/"/ మొదట ఇష్టం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది శ్రియా శరన్.

ఆ తర్వాత హీరో నాగార్జున నటించిన సంతోషం సినిమాతో ఆమె తన కెరీర్ లో మొదటి హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.

ఆ తరువాత చెన్నకేశవరెడ్డి,నువ్వే నువ్వే, ఠాగూర్, చత్రపతి, శివాజీ లాంటి సూపర్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది.

తాజాగా గమనం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన శ్రియా త్వరలోనే ఆర్ఆర్ఆర్, నరగసూరాన్,సందక్కరి, తడ్కా లాంటి చిత్రాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది ఈ ముద్దుగుమ్మ.

అలాంటి కామెంట్లు చేయడం రైటేనా నాగ్ అశ్విన్.. ఎవరి టాలెంట్ వారిదని గుర్తించాలంటూ?