శ్రియను పట్టుకున్న లండన్ పోలీసులు.. ఎందుకో తెలుసా?

నటి శ్రియ సరన్‌ను లండన్ పోలీసుల పట్టుకున్నట్లు తెలుస్తోంది.అయితే ఆమె సినిమా షూటింగ్‌లో చేసిన ఓ పనికి ఆమెను పట్టుకుని ప్రశ్నల వర్షం కురిపించారట లండన్ పోలీసులు.

ఇంతకీ శ్రియ అంతలా ఏం చేసిందని అనుకుంటున్నారా? ఆమె అక్కడి నిబంధనలను ఉల్లంఘించడమే.

శ్రియ ఇటీవల ‘సండైక్కారి’ అనే తమిళ చిత్రంలో నటుడు విమల్, సత్యన్‌తో కలిసి లండన్‌లో షూటింగ్ చేశారు.

అప్పుడు తెలియకుండా శ్రియ విమానాశ్రయంలోని హై సెక్యురిటీ పాయింట్‌లోకి అనుమతి లేకుండా వెళ్లడంతో ఆమెను పోలీసులు చుట్టుముట్టారు.

ఎలాంటి అనుమతి లేకుండా ఈ ప్రాంతంలోకి ఎందుకు వచ్చావ్ అంటూ ఆమెకు తుపాకులు గురిపెట్టారట.

దీంతో వెంటనే అక్కడున్న నటుడు విమల్‌తో పాటు చిత్ర యూనిట్ వారి షూటింగ్‌కు సంబంధించిన డాక్యుమెంట్స్ పోలీసులకు చూపించడంతో ఆమెను వారు విడిచిపెట్టారు.

అయితే ఈ ఘటనకు సంబంధించి శ్రియ, చిత్ర యూనిట్ నుండి ఎలాంటి స్టేట్‌మెంట్ రాలేదు.

దీంతో ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలి అంటున్నారు సినీ ప్రేక్షకులు.

ఏదేమైనా విమానాశ్రయంలో జరిగిన ఘటనతో శ్రియ అవాక్కయ్యిందని తెలుస్తోంది.

బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ కు సీపీఎం మద్ధతు.. సీఎం రేవంత్