మీరాతో శ్రీకృష్ణుడు కలిసి ఉండే ప్రపంచంలోనే ఉన్న ఏకైక దేవాలయం ఎక్కడుందో తెలుసా..?

హిమాచల్ ప్రదేశ్ లో పురాతనమైన చరిత్ర కలిగిన అనేక దేవాలయాలతో పాటు రహస్యాలను దాచుకున్న ఎన్నో దేవాలయాలు కూడా ఉన్నాయి.

అయితే ఇక్కడ నూర్‌పూర్‌ లోని పురాతన కోట పరిసరాలలో ఉన్న శ్రీ బ్రిజ్ రాజ్ స్వామి దేవాలయం ఎంతో ప్రత్యేకమైనది.

ఇక్కడ శ్రీకృష్ణుడు తన ప్రియసఖి రాధా తో కాకుండా మీరా బాయితో కలిసి భక్తులతో పూజలను అందుకుంటు ఉన్నారు.

"""/"/ దీంతో శ్రీకృష్ణుడు మీరాబాయి కలిసి ఉన్న ప్రపంచంలోనే ఏకైక దేవాలయం ఇదే కావడం మరో విశేషం.

ఈ రెండు విగ్రహాలు చాలా అతింద్రీయ శక్తులు కలిగి ఉన్నాయని భక్తులు నమ్ముతారు.

అంతే కాకుండా కృష్ణ మీరా బాయి విగ్రహాలు చూపరులకు కనుల విందు చేస్తూ ఆకర్షణీయంగా కనిపిస్తాయి.

ఇక్కడ కృష్ణుడిని దర్శించుకుంటే చాలు భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయని చాలా మంది భక్తులు నమ్ముతారు.

శ్రీకృష్ణుడు స్వయంగా మీ ముందు నిలబడి ఉన్నట్లుగా విగ్రహాలు తయారు చేయబడ్డాయి అని స్థానిక ప్రజలు, పూజారులు చెబుతున్నారు.

ముఖ్యంగా చెప్పాలంటే జన్మాష్టమి రోజున ఈ దేవాలయంలోని కృష్ణుడు అతీంద్రియ శక్తి అందం పెరుగుతుందని స్థానిక భక్తులు చెబుతున్నారు.

ఇంకా చెప్పాలంటే శ్రీకృష్ణుడు ప్రతి రాత్రి ఈ దేవాలయాన్ని సందర్శిస్తాడని ప్రజలు నమ్ముతారు.

"""/"/ అందుకే ఈ దేవాలయంలో ప్రతి రోజు పూజలు జరుగుతాయి.రాత్రి పూట గుడి తలుపులు మూసివేస్తారు.

విగ్రహాల ముందు నిద్రించడానికి ఏర్పాటు చేస్తారు.మంచం నీటితో నిండిన గాజు గ్లాసు ఉంచుతారు.

ఉదయం గుడి తలుపు తెరిచిన తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన మంచం మీద మడతలు ఉంటాయి.

గ్లాసు నీరు కింద పడి ఉంటుంది.శ్రీకృష్ణుడు మీర బాయి రాత్రి ఇక్కడ విశ్రాంతి తీసుకుంటారని ప్రజలు గట్టిగా నమ్ముతారు.

16 ఏళ్ల కూతురు సొంత ఇంట్లోనే బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి పాడు పని.. తండ్రి షాక్!