రుద్రవీణ రివ్యూ: సస్పెన్స్ థ్రిల్లర్ అదిరిపోయింది!
TeluguStop.com
డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన సినిమా రుద్రవీణ.ఈ సినిమా లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ నేపథ్యంలో రూపొందింది.
ఇక ఈ సినిమాలో శ్రీరామ్ నిమ్మల, ఎల్సా శుభశ్రీ, రఘు కుంచే, చలాకి చంటి, సోనియా, రమణారెడ్డి తదితరులు నటించారు.
మహావీర్ మ్యూజిక్ ను అందించాడు.లక్ష్మణరావు రాగుల నిర్మాతగా బాధ్యతలు చేపట్టాడు.
ఇక ఈరోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుందో చూద్దాం.
ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇక ఈ సినిమా నటీనటులకు ఎటువంటి సక్సెస్ అందించిందో ఇప్పుడు చూద్దాం.h3 Class=subheader-styleకథ:/h3p కథ విషయానికి వస్తే.
యానం సిటీలో లాలప్ప (రఘుకుంచే) నివసిస్తాడు.పైగా తన తమ్ముళ్లు ముత్తప్ప, కన్నప్ప లు కూడా అక్కడే ఉంటారు.
ఇక వీరు చేపల బిజినెస్ చేస్తున్నాము అంటూ డ్రగ్స్, మర్డర్స్, మానభంగాలు చేస్తూ రౌడీ లాగా తిరుగుతుంటారు.
అయితే అక్కడే రుద్ర (శ్రీరామ్ నిమ్మల) నివసిస్తూ చిన్న పిల్లలకు క్రికెట్ నేర్పిస్తూ ఉంటారు.
అయితే లాలప్ప మనుషులను రుద్ర చంపుతూ ఉంటాడు.దీంతో లాలప్ప తన మనుషులను ఎవరు ఎందుకు చంపుతున్నారో తెలియక రుద్ర కోసం ఊరంతా వెతుకుతాడు.
ఇక ప్రియా (ఎల్సా) జీవులను ప్రేమిస్తూ ఉంటుంది.వాటిని చంపడం పాపం అంటూ అందరికీ చెబుతూ ఉంటుంది.
"""/"/ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఫ్లాకార్డులు పట్టుకొని అందరికీ చెబుతూ ఉంటుంది.
ఆ సమయంలో రుద్ర ప్రియా ని చూసి ప్రేమలో పడతాడు.ఇక ఆమె కూడా అతని ప్రేమలో పడుతుంది.
మరోవైపు లాలప్ప ఎంక్వయిర్ చేస్తూ ఉంటాడు.ఇక రుద్ర తన ఇద్దరి తమ్ములను కూడా చంపేస్తాడు.
ఇక జైల్లో ఉన్న వీణ (శుభశ్రీ) కు ఉరిశిక్ష విధిస్తారు.ఇంతకు వీణ జైల్లో ఎందుకు ఉంది.
రుద్ర లాలప్ప మనుషులను ఎందుకు చంపుతూ ఉంటాడు.చివరికి ఏం జరుగుతుంది అనేది మిగిలిన కథలోనిది.
H3 Class=subheader-styleనటినటుల నటన:/h3p శ్రీరామ్ తన పాత్రతో బాగా ఆకట్టుకున్నాడు.మాస్ క్యారెక్టర్ తో పాటు క్లాస్ గా కూడా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.
ఇక ఎల్సా కూడా అద్భుతంగా నటించింది.మిగతా నటీనటులంతా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
H3 Class=subheader-styleటెక్నికల్:/h3p టెక్నికల్ పరంగా ఈ సినిమా కథ రొటీన్ గా అనిపించిన కూడా కాస్త ఆకట్టుకునే విధంగా ఉందని చెప్పవచ్చు.
ఇక సంగీతం బాగా ఆకట్టుకుంది.బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పరవాలేదు.
సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది.మిగిలిన టెక్నికల్ విభాగాలు బాగా పనిచేసాయి.
"""/"/
H3 Class=subheader-styleవిశ్లేషణ: /h3pఇక ఈ సినిమా లవ్ కాన్సెప్ట్ తో పాటు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా కూడా రూపొందింది.
ఇక నటీనటుల మధ్య చూపించిన సన్నివేశాలు బాగా ఆకట్టుకున్నాయి.అంతేకాకుండా కొన్ని ట్విస్ట్ లు కూడా ఆకట్టుకున్నాయి.
H3 Class=subheader-styleప్లస్ పాయింట్స్:/h3p నటీనటుల నటన, సంగీతం, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, కొన్ని సన్నివేశాలు బాగా ఆకట్టుకున్నాయి.
H3 Class=subheader-styleమైనస్ పాయింట్స్:/h3p అక్కడక్కడ సాగదీసినట్లు అనిపించింది.h3 Class=subheader-styleబాటమ్ లైన్:/h3p చివరిగా చెప్పాల్సిందేంటంటే ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు.
రొటీన్ గా ఉన్న కూడా ఈ సినిమా బాగా నచ్చుతుంది.h3 Class=subheader-styleరేటింగ్: 3/5/h3p.
వీడియో వైరల్: అయ్యబాబోయ్.. పావురానికి ఇలా కూడా ట్రైనింగ్ ఇస్తారా?