కష్టాలు కన్నీళ్లు గట్టెక్కించే కన్నె తులసి నోము ఎలా చేయాలో తెలుసా..?
TeluguStop.com
శ్రావణమాసం ( Shravanamasam ) అంటే నోములు, వ్రతాల మాసం అని చాలా మంది చెబుతూ ఉంటారు.
మహిళలు ఏ నోము నోచుకున్న, ఏ వ్రతం ఆచరించిన లక్ష్మీదేవికి( Lakshmi Devi ) ప్రీతికరమైన శ్రావణమాసంలోనే నిర్వహించుకుంటూ ఉంటారు.
అటువంటి నోముల్లో ఒక నోము కష్టాలను, కన్నీళ్ళను గట్టెక్కించే నోము ఒకటి ఉంది.
ఇది వివాహమైనా ముత్తయిదులు చేసుకునేది కాదు.వివాహం కాని కన్నెపిల్లలు నోచుకునే నోము.
నోములోనే ఉంది కన్నె అనే మాట.ఈ నోము కష్టాలను, కన్నీళ్ళ నుంచి గట్టెక్కిస్తుందని చాలామంది ప్రజలు నమ్ముతారు.
"""/" /
ఈ కన్నె తులసి నోము( Kanne Tulai Nomu ) నోచుకుంటే మంచి భర్త లభిస్తాడని, సౌభాగ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
అంతే కాకుండా ఈ నోము నోచుకుంటే ఆరోగ్యాన్ని ఆయుష్షుని, కలిగిస్తుందని వివాహం తర్వాత సౌభాగ్యాన్ని ఇస్తుందని చెబుతున్నారు.
ఈ నోము చేసుకునే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.కన్నెపిల్లలు ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేచి స్నానం చేసి తులసి మొక్క చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేయాలి.
తులసి మాతకు మనస్ఫూర్తిగా భక్తి తో మూడు నమస్కారాలు చేసుకోవాలి. """/" /
పూజలో చేసిన అక్షింతలు తలపై వేసుకోవాలి.
తులసిని పూజించక 26 జతల అరిసెలు చేయించి 13 జతల అరిసెలను తులసమ్మకు నైవేద్యంగా పెట్టండి.
నోము అంటే వాయనం అనేది అత్యంత ముఖ్యమైనది.ఈ కన్నె తులసి నోములో కూడా వాయనం ఇవ్వాల్సి ఉంటుంది.
కన్నె తులసి నోము కాబట్టి కన్నెపిల్లకే వాయనం ఇవ్వాలి.అలా ఒక కన్నెపిల్లకు కొత్త బట్టలు పెట్టి ఆమెకు 13 జతల అరిసెలను వాయాననివ్వాలి.
నైవేద్యంగా పెట్టిన అరిసెలను తన ఈడు పిల్లలతో కలిసి తినాలి.తర్వాత ఉద్యాపన చెప్పుకోవాలి.
ప్రమాదం నుంచి బయటపడిన సోనుసూద్ భార్య… కాపాడింది ఇదే అంటూ పోస్ట్!