శ్రావణ శుక్రవారం అమ్మవారికి ఆవునెయ్యితో దీపారాధన చేస్తే..?

శ్రావణ శుక్రవారం అమ్మవారికి ఆవునెయ్యితో దీపారాధన చేస్తే?

హిందువులు ఎంతో పవిత్రంగా భావించే శ్రావణమాసంలో మహిళలు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలలో పాల్గొంటారు.

శ్రావణ శుక్రవారం అమ్మవారికి ఆవునెయ్యితో దీపారాధన చేస్తే?

ఈ క్రమంలోనే శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళ శుక్రవారాలు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు.

శ్రావణ శుక్రవారం అమ్మవారికి ఆవునెయ్యితో దీపారాధన చేస్తే?

శ్రావణమాసంలో వచ్చే మంగళవారం మంగళ గౌరీ వ్రతం, శుక్రవారం వరలక్ష్మీ దేవిని పూజ చేస్తూ ఉంటారు.

ఈ విధంగా మహిళలు శుక్రవారం అమ్మవారిని పూజించడం వల్ల సకల సంతోషాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని భావిస్తారు.

ఈ క్రమంలోనే శ్రావణ శుక్రవారం అమ్మవారికి ఏ విధంగా పూజ చేయాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

శ్రావణ శుక్రవారం అమ్మవారికి వరలక్ష్మీ వ్రతం చేసి ముత్తైదువులకు పసుపు కుంకుమలతో వాయనం ఇవ్వడం వల్ల వారి పసుపు కుంకాలు పదికాలాలపాటు చల్లగా ఉంటాయని భావిస్తారు.

శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించాలి.శ్రావణ శుక్రవారం అమ్మవారికి తెల్లటి పుష్పాలతో పూజ చేయటం వల్ల అమ్మవారి అనుగ్రహం మనపై కలుగుతుంది.

అదేవిధంగా ఆవునెయ్యితో దీపారాధన చేయటం వల్ల సుమంగళీ ప్రాప్తం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.

"""/"/ ఈ విధంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించి లక్ష్మీ దేవి అష్టోత్తరం, లలితా సహస్రనామాలను మనస్ఫూర్తిగా చదవటం వల్ల అమ్మవారి అనుగ్రహం మనపై ఉంటుంది.

ఇంట్లో పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుని అమ్మవారి ఆలయాన్ని దర్శించాలి.ఈ విధంగా శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు ముత్తైదువులను ఇంటికి పిలిచి వారికి పసుపు కుంకుమలను ఇవ్వటం వల్ల మనం అనుకున్న పనులు విజయవంతంగా పూర్తవుతాయని పండితులు చెబుతున్నారు.

అదేవిధంగా చాలామంది మహిళలు ఉపవాస దీక్షలతో ఈ వ్రతాలు ఆచరిస్తూ ఉంటారు.ఈ విధంగా ఉపవాస దీక్ష చేసే వారు ఎలాంటి పరిస్థితులలో కూడా ఉల్లిపాయ, వెల్లుల్లి, ఉప్పు కలిపిన ఆహార పదార్థాలను తీసుకోకూడదు.