అలా పిలిస్తే మాత్రమే బాలకృష్ణకు ఇష్టం.. శ్రద్ధా శ్రీనాథ్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్( Shraddha Srinath ) గురించి తెలిసిందే.

మొదట జెర్సీ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన ఈమె మంచి మంచి పాత్రలో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇక గత ఏడాది సైంధవ్,మెకానిక్ రాకీ వంటి సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యింది.

శ్రద్ధా శ్రీనాథ్ తాజాగా నటించిన చిత్రం డాకు మహారాజ్.( Daaku Maharaaj ) బాలకృష్ణ( Balakrishna ) హీరోగా నటించిన ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే తాజాగా మీడియాతో ముచ్చటించారు శ్రద్ధా శ్రీనాథ్.

ఈ సందర్భంగా ఆమె ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.

"""/" / నా కెరీర్‌కి చాలా ముఖ్యమైన సినిమా డాకు మహారాజ్‌.నేను ఇప్పటి వరకూ చేసిన సినిమాలు థ్రిల్లర్‌ లు గానో, లేదంటే యాక్షన్‌ ప్రధానమైన కథలుగానో ఓకే ప్రత్యేకమైన థీమ్‌ తోనో సాగేవే.

అందుకు భిన్నంగా కమర్షియల్‌ హంగులన్నీ ఉన్న కథలో ఇప్పటివరకూ నటించలేదు.ఆ అవకాశం ఈ సినిమాతో దక్కింది.

దాంతో పాటు బలమైన పాత్ర కూడా.ఎంత అందంగా కనిపిస్తుంటానో, భావోద్వేగాల పరంగా అంతే లోతైన పాత్ర.

నందిని( Nandini ) అనే యువతిగా నేను కనిపిస్తాను.సున్నితంగా కనిపిస్తూనే, ఎప్పుడు ఏం మాట్లాడాలో ఏం చేయాలో తెలిసిన పాత్ర.

ప్రేక్షకులకు బలంగా కనెక్ట్‌ అవుతుంది. """/" / లుక్‌ పరంగా కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నాము.

ఈ పాత్రలో నటిస్తూ చాలా ఆస్వాదించాను అని తెలిపింది.నాపై నమ్మకంతో నందిని పాత్రని అప్పజెప్పారు.

డబ్బింగ్‌ సొంతంగా చెప్పుకున్నా.నటనపై అద్భుతమైన అవగాహన ఉన్న బాబీ( Bobby ) సూచనల్ని పాటిస్తూ నటించాను అని తెలిపింది.

బాలకృష్ణతో కలిసి నటించడం ఓకే గొప్ప అనుభవం.ఇన్ని సినిమాలు చేశాను కదా, ఇంత అనుభవం ఉంది కదా అనే ధోరణితో ఆయన ఎప్పుడూ నడుచుకోరు.

సెట్‌ లో ఓకే కొత్త నటుడిలాగే దర్శకుడు చెప్పేది ప్రతిదీ శ్రద్ధగా వింటూ నటిస్తుంటారు.

ఆయన ఉత్సాహం నన్నెంతగానో ఆశ్చర్య పరిచింది.సెట్లో ఆయన తోటి నటులతో ఎంతో సరదాగా మెలుగుతుంటారు.

సర్‌ అని పిలిస్తే, బాలా( Bala ) అని పిలువు అనేవాళ్లు.అలా పిలిస్తేనే ఆయనకి ఇష్టం.

అంత సరదాగా ఉండే ఆయన ఒక్కసారి కెమెరా ముందుకు వెళ్లగానే, చుట్టూ ప్రపంచాన్ని మరిచిపోయి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తుంటారు.

ఆయన్నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను.బాలకృష్ణ సినిమా అంటే ప్రపంచం మొత్తం చూస్తుంది.

అలాంటి సినిమాలో భాగమైతే ఎక్కువమంది ప్రేక్షకులకు చేరువయ్యే అవకాశం ఉంటుంది.అన్ని రకాలుగా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించి ఇందులో నటించాను అని చెప్పుకొచ్చింది హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్.

వీడియో: పాడుబడిన ఇంట్లో వెతుకుతుంటే ఊహించని ట్విస్ట్.. గోడల్లో నిధి చూసి షాక్!