పుష్ప సీక్వెల్ లో స్పెషల్ సాంగ్ కోసం శ్రద్ధ డిమాండ్ చేసిన రెమ్యునరేషన్ తెలిస్తే షాకవ్వాల్సిందే!
TeluguStop.com
పుష్ప ది రైజ్( Pushpa The Rise ) మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవగా పుష్ప ది రూల్( Pushpa The Rule ) మూవీ ఈ ఏడాది డిసెంబర్ నెల 5వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.
ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ గురించి ఇప్పటికే ఎన్నో వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చాయి.
అయితే ఈ సాంగ్ లో శ్రద్ధా కపూర్( Shraddha Kapoor ) ఫైనల్ అయిందని వార్తలు వచ్చాయి.
పాన్ ఇండియా మూవీ కావడంతో మేకర్స్ శ్రద్ధా కపూర్ కు ఓటు వేశారని ప్రచారం జరిగింది.
"""/" /
అయితే స్పెషల్ సాంగ్ చేయడానికి శ్రద్ధా కపూర్ ఓకే చెప్పారు కానీ ఆమె ఏకంగా 8 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేశారని భోగట్టా.
పుష్ప యూనిట్ 3 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఇవ్వలేమని తేల్చి చెప్పిన నేపథ్యంలో ఎటూ తేలక చివరకు శ్రీలీల( Sreeleela ) ఫైనల్ అయ్యారట.
శ్రీలీల ఈ సాంగ్ కోసం కోటిన్నర రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది.
"""/" /
శ్రీలీల ఈ సాంగ్ తో పాన్ ఇండియా స్థాయిలో బాక్సాఫీస్ ను షేక్ చేస్తారేమో చూడాల్సి ఉంది.
పుష్ప ది రూల్ మూవీ షూటింగ్ తో పాటు ఫస్ట్ కాపీ ఈ నెల చివరి నాటికి పూర్తి కానున్నాయని ఈ సినిమాతో శ్రీలీలకు మళ్లీ పూర్వ వైభవం వచ్చే ఛాన్స్ ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
పుష్ప ది రూల్ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో హిట్ గా నిలుస్తుందో చూడాల్సి ఉంది.
శ్రీలీల కెరీర్ ప్లాన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి.శ్రీలీల డిసెంబర్ నెలలో రాబిన్ హుడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
రాబిన్ హుడ్ సినిమా డిసెంబర్ నెల 20వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లోనే రాబిన్ హుడ్ సినిమా తెరకెక్కుతోంది.
మహేష్ నా చిన్న తమ్ముడు… పవన్ అందుకే మా ఇంటికి వచ్చేవాడు: వెంకటేష్