ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలు అందరికీ అందుబాటులో ఉండడం వల్ల సెలబ్రిటీలకి, సామాన్యులకి మరియు అభిమానులకి మధ్య దూరం బాగా తగ్గిపోయింది.
దీంతో కొంత మంది అభిమానులు తమకు ఇష్టమైన నటీనటులను సోషల్ మీడియా ద్వారా ట్రోల్స్ చేస్తూ తమ అభిమాన నటుడు లేదా నటి మెప్పును పొందుతున్నారు.
అయితే తాజాగా ఓ యువకుడు సోషల్ మీడియా మాధ్యమం అయినటువంటి టిక్ టాక్ ద్వారా బాలీవుడ్ స్టార్ హీరో యిన్ శ్రద్ధా కపూర్ కి లవ్ ప్రపోస్ చేశాడు.
అయితే అది కూడా తన ల్యాప్ టాప్ లో వీడియో చూస్తూ శ్రద్ధా కపూర్ ఫోటో కి ప్రేమిస్తున్నానంటూ వినూత్నరీతిలో వీడియో చేసి టిక్ టాక్ లో షేర్ చేశాడు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతోంది.అయితే కొంతమంది నెటిజన్లు మాత్రం తమకు ఇష్టమైన లేదా అభిమాన నటీనటులను ఎలాగో ప్రత్యక్షంగా కలుసుకుని తన మనసులోని మాటలను వారితో పంచుకోవడం కుదరదని కనీసం ఇలాగైనా వారి ఫొటోలతో తమ హావ భావాలను పంచుకుంటే కొంతమేర మానసిక ఆనందం పొందవచ్చని తెగ కామెంట్లు చేస్తున్నారు.
మరోవైపు ఎంత ఇష్టం ఉంటే మాత్రం ఇలా ఫోటోకి ప్రపోజ్ చేయడం ఏంటని అంటున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలను కొంతమంది కేవలం తమ ఎంటర్టైన్మెంట్ కోసమే కాకుండా ఇతరులకు సహాయం చేయడానికి కూడా ఉపయోగిస్తూ మంచి పనులు చేస్తున్నారు.
కాబట్టి సోషల్ మీడియా మాధ్యమాలను చెడు పనులకు కాకుండా మంచి పనులకు ఉపయోగిస్తే మంచి ఫలితాలు ఉంటాయని కొందరు సోషల్ మీడియా నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కోర్ట్ సినిమా డైరెక్టర్ కు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన నాని.. ఈ నిర్ణయాన్ని మెచ్చుకోవాల్సిందే!