షోరూమ్ సిబ్బంది నిర్ల‌క్ష్యం.. మొద‌టి అంత‌స్తు నుంచి కొత్త కారు ఏకంగా...!

కొత్త కారు కొనాలనే ఆశ ప్రతీ ఒక్కరికి ఉంటుంది.కారు కొనాలనే కల సాకారం చేసుకునేందుకు గాను ఏళ్ల తరబడి డబ్బులు పోగేసుకుంటారు చాలా మంది.

తమ బడ్జెట్ రేంజ్ ఏంటో తెలుసుకుని మరీ అందులో రీజనబుల్ ప్లస్ అట్రాక్టివ్ కారు సెలక్ట్ చేసుకుంటారు.

ఈ మాదిరిగానే ఓ ఉద్యోగి కొత్త కారు సెలక్ట్ చేసుకున్నాడు.అయితే, అతడి అదృష్టమో, సిబ్బంది నిర్లక్ష్యమో కానీ కొత్త కారు కొన్న రెండు నిమిషాల్లోనే ధ్వంసమైంది.

ఇంతకీ సదరు ఘటన ఎక్కడ జరిగింది? ఎలా జరిగిందంటే.హైదరాబాద్‌లోని మేడిపల్లికి చెందిన ఎల్‌ఐసీ ఉద్యోగి భగవత్‌ ఎప్పటి నుంచో కొత్త కారు కొనాలనుకుంటున్నారు.

తాజాగా అల్కాపురి చౌరస్తా వద్ద ఉన్న టాటా కార్ల షోరూంలో కొత్త టాటా టియాగో ఎస్టీ 1.

2 కారును కొన్నాడు.ఈ క్రమంలో మొదటి అంతస్తు నుంచి ఓపెన్‌ లిఫ్టులో తన కారును కిందకు దించాలనుకున్నాడు.

అయితే, అక్కడే అనుకోని ఉపద్రవం ఎదురైంది.కారులో అతడు కూర్చొని ఓపెన్ లిఫ్ట్‌లోకి ఎక్కించడాని కంటె ముందే అది అదుపు తప్పి ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందపడింది.

కారులో ఉన్న అతడి ఫేస్‌కు గాయాలయ్యాయి.కారు కింద పడే క్రమంలో షోరూం ఎదుట పార్కు చేసి ఉన్న మరో కారు, బైక్ కూడా ధ్వంసమయ్యాయి.

తన కొత్త కారు ధ్వంసమైందంటూ బాధితుడు భగవత్ ఎల్‌బీ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఈ నేపథ్యంలో అల్కాపురి చౌరస్తాలోని టాటా కార్ల షోరూం బిల్డింగ్‌లో నిర్వాహకులు ఏర్పాటు చేసిన ఓపెన్ లిఫ్టుకు జీహెచ్‌ఎంసీ నుంచి పర్మిషన్ లేదని స్థానికులు చెప్తున్నారు.

ఆఫీసర్లు స్పందించి షోరూం నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.కాగా, భగవత్‌కు సరిగా డ్రైవింగ్ రాకపోవడం వల్లే చిన్నపాటి ప్రమాదం జరిగిందని, కారు ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఎకాఎకిన కిందపడిందని షోరూం సిబ్బంది చెప్తుండటం గమనార్హం.

వైరల్: ఇదెలా సాధ్యం.. నల్ల కుక్క రెండేళ్లలో తెల్లగా ఎలా మారిపోయిందబ్బా..?!