రోజుకు 5 సార్లు, డ్రగ్స్ లేకుండా సుశాంత్ ఉండలేక పోయేవాడు
TeluguStop.com

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతికి రియా కారణం అంటూ ఆయన కుటుంబ సభ్యులు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు.


అక్కడ నుండి సీబీఐకి కేసు బదిలీ అయ్యింది.సీబీఐ విచారణలో పలు ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి.


సుశాంత్ కు రియాకు మద్య ప్రేమ వ్యవహారం సాగిందనే విషయం ఆయన మృతి సమయంలోనే వెళ్లడి అయ్యింది.
అయితే సుశాంత్ కు రియా డ్రగ్స్ సరఫరా చేసింది అంటూ సీబీఐ ఎంక్వౌరీలో వెళ్లడి అయ్యింది.
ఈ నేపథ్యంలో ఆమె సోదరుడు కూడా డ్రగ్స్ కేసులో ఉన్నట్లుగా నిరూపితం అయ్యింది.
రియా మరియు ఆమె సోదరుడిని ఎన్‌సీబీ అధికారులు అరెస్ట్ చేశారు.రియా సోదరుడు శోవిక్ విచారణలో నమ్మలేని విషయాలను చెబుతున్నాడు.
అతడి వ్యాఖ్యలు చాలా నమ్మశక్యంగా లేవని సుశాంత్ పరువు తీసేవిగా ఉన్నాయంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
సుశాంత్ కు డ్రగ్స్ అలవాటు ఉందని, సుశాంత్ కోసం రియా తనను డ్రగ్స్ డీలర్ వద్దకు పంపించినట్లుగా శోవిక్ చెబుతున్నాడు.
తనకు తెలిసిన దాని ప్రకారం సుశాంత్ రోజులో అయిదు సార్లు డ్రగ్స్ ను తీసుకుంటాడు.
అయిదు గ్రాముల డ్రగ్స్ ను 20 సార్లు అతడు వాడుతాడు అంటూ రియా నాకు ఒక సారి చెప్పింది.
డ్రగ్స్ డీలర్లతో రియా చేసిన వాట్సప్ చాటింగ్ నిజమే అంటూ శోవిక్ పేర్కొన్నాడు.
డ్రగ్స్ ను ఎప్పుడు కూడా తాను వాడలేదు అని, తనకు అలవాటు లేదు అన్నాడు.
నేడు శోవిక్ కు డ్రగ్స్ టెస్ట్ నిర్వహించే అవకాశం ఉంది.దాంతో అతడు నిజం చెప్పాడా లేదా అనే విషయంలో క్లారిటీ రానుంది.
ఎన్‌సీబీ విచారిస్తున్న దాని ప్రకారం డ్రగ్స్ డీలర్లకు బాలీవుడ్ లో చాలా మందితో సంబంధాలు ఉన్నట్లుగా వెళ్లడి అవుతుంది.
ముందు ముందు ఈ కేసులో చాలా మంది కూడా అరెస్ట్ అవుతారు అంటున్నారు.
సుశాంత్ గత కొన్నాళ్లుగా డ్రగ్స్ తీసుకుంటున్నట్లుగా శోవిక్ చెబుతున్న నేపథ్యంలో జాతీయ మీడియాలో ఆసక్తికర కథనాలు వెళ్లడి అవుతున్నాయి.
సుశాంత్ ను ఇప్పుడు బ్యాడ్ చేసి వారికి వారు మంచి వారు అవ్వాలని రియా మరియు ఆమె సోదరుడు శోవిక్ లు ప్రయత్నాలు చేస్తున్నారు.
సుశాంత్ కు ఒక వేళ డ్రగ్స్ అలవాటు ఉంటే అది ఖచ్చితంగా రియా లేదా ఆమె కుటుంబ సభ్యులు అలవాటు చేసి ఉంటారు అనేది కొందరి వాదన.
మొత్తానికి సుశాంత్ డ్రగ్స్ లేకుండా ఉండలేనంతగా అడిక్ట్ అయ్యాడు అంటూ ప్రచారం జరుగుతోంది.
శోవిక్ వ్యాఖ్యలపై జరుగుతున్న చర్చ సుశాంత్ పరువు తీసే విధంగా ఉంది.