పేదవారికి మంచి విద్య అందకూడదా..?: మంత్రి బొత్స
TeluguStop.com
ఏపీ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
అందరికీ విద్య అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.ఈ క్రమంలోనే పేద విద్యార్థుల కోసం బైజూస్ తెచ్చామని మంత్రి బొత్స తెలిపారు.
కానీ ప్రభుత్వం మంచి చేస్తుంటే విపక్ష నేతలు తట్టుకోలేకపోతున్నారన్నారు.పేదవారికి మంచి విద్య అందకూడదా అని ప్రశ్నించారు.
పేదలు అభివృద్ధి చెందకూడదని ప్రతిపక్షాల భావన అని మండిపడ్డారు.విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్ లు ఓపెన్ టెండర్ ద్వారానే తీసుకున్నామన్న మంత్రి బొత్స విద్యార్థుల మనోధైర్యాన్ని దెబ్బతీయొద్దని కోరారు.
ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లను తయారు చేస్తున్నామని తెలిపారు.
ఆస్కార్ రేసులోకి ఎంట్రీ ఇచ్చిన ‘కంగువా’