అమ్మాయి మంగళ, శుక్ర వారాల్లో అత్తారింటికి వెళ్లకూడదా?
TeluguStop.com
పెళ్లై అత్తారింటికి వెళ్లిన అమ్మాయి పుట్టింటికి వచ్చి.మళ్లీ అత్తారింటికి వెళ్లేటప్పుడు మంగళ, శుక్ర వారాల్లో తిరుగు ప్రయాణం చేయకూడదు అని చెబుతుంటారు పెద్దలు.
అసలు ఆ రోజుల్లో వెళ్తే ఎమవుతుంది? అలా ఎందుకు వెళ్ల కూడదు అంటారో తెలుసుకుందాం.
మంగళ వారం, శుక్రవారం లక్ష్మీదేవి స్థానాలని పురాణాలు చెబుతున్నాయి.పుట్టింట్లో ఆడ పిల్లదీ లక్ష్మీదేవి స్థానం కాబట్టి.
ఆమె మంగళ, శుక్ర వారాల్లో బయటకు వెళ్లకూడదని ప్రతీతి.ముఖ్యంగా పెళ్లై అత్తారింటికి వెళ్లే అమ్మాయిని మాత్రం అస్సలు మంగళ, శుక్ర వారాల్లో పంపించరు.
ఒకవేళ ఖచ్చితంగా మంగళ, శుక్ర వారాల్లో వెళ్లాల్సి వచ్చి వెళ్తే.పుట్టింటి మహాలక్ష్మీ అమ్మాయితో పాటు అత్తింటికి వెళ్లిపోతుందని పెద్దల నమ్మకం.
ఏదో సమస్య వచ్చో లేదా ఖచ్చితంగా వెళ్లాల్సి వస్తే మాత్రం.ముందు రోజు గడప బయట ఒక సంచిని పెడుతుంటారు.
ఆ తర్వాతి రోజు ఆడపిల్ల అత్తారింటికి వెళ్లేటప్పుడు ఆ సంచిని తీసుకెళ్లమని చెబుతారు.
అలా సంచి తీసుకెళ్తే దోషం ఉండదని భావిస్తారు.అలాగే ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి అదృష్టం కలిసి వస్తే.
పెళ్లై ఆ అమ్మాయి అత్తారింటికి వెళ్లేటప్పుడు పుట్టినింటి గడపపై బంగారు తీగను కొట్టిస్తారు.
అలా చేయడం వల్ల ఆ అమ్మాయితో వచ్చిన అదృష్ట లక్ష్మి వాళ్లింట్లోనే ఉంటుందని నమ్మకం.
అంతే కాదండోయ్ అమ్మాయి ఇంటికొచ్చి తొమ్మిదో రోజు వెళ్తుంటే కూడా వద్దని వారిస్తుంటారు.
వివాహం అయిన ఆడపిల్ల 14 ఏళ్లు పుట్టింటికి దూరంగా ఉండి తర్వాత వెళ్లాల్సి వస్తే మాత్రం పరిహారాలు చేయించాలని పెద్దలు చెబుతుంటారు.
కానీ అలాంటివేం చేయించాల్సిన అవసరం లేదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
ఏపీ బీజేపీ కి కొత్త అధ్యక్షుడు ఆయనేనా ?