గుడిలో పూజారికి దక్షిణ ఇవ్వాలా ?
TeluguStop.com
సాధారణంగా గుడికి వెళ్ళినప్పుడు పూజారికి దక్షిణ ఇస్తూ ఉంటాం.అయితే పూజారికి దక్షిణ తప్పని సరిగా ఇవ్వాలి అనే నియమం ఏమి లేదు.
కాని నిత్యం భగవంతుని సేవలో ఉండే పూజారికి మనకు తోచిన విధంగా దానం చెయ్యడంలో తప్పు ఏముంది? అన్నింటికీ డబ్బులు అవసరం అందరికీ డబ్బులు కావాలి.
పూర్వకాలంలో జమిందారీ వ్యవస్థ మరియు రాజరికపు వ్యవస్థ ఉండేవి వారు తమకు తోచిన విధంగా పూజారికి అవసరమైన సహాయం చేసేవారు.
ఇప్పుడు కాలం మారటంతో పూజారికి దక్షిణ వేసే భక్తులు సంఖ్య కూడా తగ్గింది.
కావున వ్రతాలు పండుగులకు పూజారులు తమంతట తాము భక్తి కొరకు ధన సహాయం అడగడం చాల చోట్ల కనపడుతుంది.
పూజారికి ఎంత దక్షిణ ఇవ్వాలి అనే విషయానికి వస్తే.ఒక అతిధి మీ ఇంటికి వస్తే భోజనం పెట్టడానికి ఎంత ఖర్చు అవుతుందో అంచనా వేస్తే 101 రూపాయలు అవుతుందని అనుకొందాము మరి అదే ఒక పండుగ రోజు గుడిలో పూజారికి దక్షిణ 11 రూపాయలు వేస్తే మనకు పెద్ద భారం కాదు కదా! గుడిలో పూజారికి దక్షిణ ఇవ్వాలా అనే సందేహం పక్కన పెట్టి మీకు తోచిన విధంగా సహాయం చేయండి.
దిండు కింద దాక్కున్న పెద్ద కోబ్రా.. వీడియో చూస్తే అదిరిపడతారు..!