సొంత ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయలేకపోతే టీఆర్ఎస్ కు భంగపాటు తప్పదా?
TeluguStop.com
గత సంవత్సరం నుండి ఇప్పటివరకు టీఆర్ఎస్ కు చాలా విషయాల్లో భంగపాటు తప్పడం లేదు.
అయోధ్య రామాలయ నిర్మాణ నిధి సేకరణకు సంబంధించి ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలు, తాజాగా పెద్దపల్లిలో జరిగిన హత్యా ఘటన ఇలా చాలా ఘటనలు ప్రతిపక్షాలకు ఆయుధంగా మారి టీఆర్ఎస్ ను ముప్పు తిప్పలు పెట్టిన పరిస్థితి ఉంది.
సీఎం గా కేటీఆర్ సీఎం ప్రచారాన్ని ఎవరూ చేయవద్దని టీఆర్ఎస్ నేతలకు గట్టి వార్నింగ్ ఇవ్వగలిగిన కేసీఆర్ ఎమ్మెల్యేల వ్యవహారశైలిపై స్పందించకపోవడంతో ఈ తరహా ఘటనలు తరచూ జరగడానికి ఆస్కారం కలుగుతోంది.
ఇది ఇలాగే కొనసాగితే ప్రజల్లో తిరుగుబాటు వస్తే ఎలా ఉంటుందో కేసీఆర్ కు తెలియనిది కాదని రాజకీయవర్గాలు అభిప్రాయపడుతున్నారు.
ఎందుకంటే ఇప్పటికే క్షేత్ర స్థాయిలో కొంత జరిగిన నష్టం జరిగిన మాట వాస్తవమే.
అందుకే దుబ్బాక, గ్రేటర్ ఎన్నికలలో టీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ ఎంత గట్టిగా తగిలిందో టీఆర్ఎస్ గ్రహించినా ఇంకా సంరక్షణ చర్యలు చేపట్టకపోతే ఇక టీఆర్ఎస్ కు పెద్ద దెబ్బను ఓటర్ల రూపంలో తగిలే అవకాశం లేకపోలేదు.
మరి భవిష్యత్తులో పాఠాలు నేర్చుకొని ఎమ్మెల్యేలు తీరు మార్చుకుంటారేమో ఇక చూడాల్సి ఉంది.