రాజమౌళి టీమ్ లోకి తీసుకోవాలంటే వాళ్ళకి ఈ క్వాలిటీస్ ఉండాలా..?

తెలుగులో డైరెక్టర్ గా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టిన రాజమౌళి( Rajamouli ) ప్రస్తుతం దర్శక ధీరుడి గా గుర్తింపు పొందాడు.

ఇక పాన్ ఇండియాలో లోనే టాప్ డైరెక్టర్గా ఎదిగాడు.ఇక ఇప్పుడు ఇండియాను దాటి పాన్ వరల్డ్ లో సినిమా చేస్తున్నాడు.

ఇక మహేష్ బాబుతో తను చేయబోయే సినిమా కోసం ఇప్పటికే చాలా కసరత్తులను కూడా చేస్తున్నాడు.

అయితే ఇలాంటి క్రమంలోనే మహేష్ బాబుతో( Mahesh Babu ) రాజమౌళి చేసే సినిమా మీద జనాల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి.

"""/" / ఇక ఇదిలా ఉంటే రాజమౌళి దగ్గర ఉండే టీమ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది.

రైటర్ అయిన, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయిన ప్రతి ఒక్కరూ చాలా నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ ఉంటారు.

అందువల్ల రాజమౌళి టీం లో పనిచేస్తే వాళ్ళకి మంచి గుర్తింపు రావడమే కాకుండా సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు కూడా బాగా వస్తాయనే ఉద్దేశ్యం తో ప్రతి ఒక్కరు ఆయన టీమ్ లో పనిచేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.

ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన దగ్గర వర్క్ చేయాలంటే ముఖ్యంగా వాళ్ళ దగ్గర కొన్ని క్వాలిటీస్ అయితే ఉండాలట.

"""/" / అవి ఏంటి అంటే వాళ్లు టైం తో పని లేకుండా వర్క్ చేసేవాళ్లు అయి ఉండాలి, ఎంతటి ఒత్తిడినైనా ఎదుర్కొని సినిమా కోసం పరితపించే వాళ్లై ఉండాలి.

ఇక అయన దగ్గరే ఐదు నుంచి ఆరు సంవత్సరాల పాటు తనతోనే ట్రావెల్ అవుతామని ఫిక్స్ అయి ఉండాలి.

అలాంటి వారిని మాత్రమే ఆయన తన టీమ్ లోకి తీసుకుంటాడట.ఇక మొత్తానికైతే రాజమౌళి దగ్గర డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో వర్క్ చేయాలంటే పెషెన్సి కూడా ఎక్కువగా ఉండాలని ఆయనతో పని చేసే వాళ్లు చెబుతూ ఉంటారు.

ఇక ప్రస్తుతానికి రాజమౌళి మాత్రం చాలా బిజీగా ఉన్నాడు.

పదేళ్ల కల నెరవేరింది…నాగబాబు ఎమోషనల్ పోస్ట్ వైరల్!