ప్లీనరీతో టీఆర్ఎస్ ప్రతిపక్షాల విమర్శలకు ఘాటుగా సమాధానం ఇవ్వనుందా?

టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ త్వరలో జరగనున్న విషయం తెలిసిందే.టీఆర్ఎస్ పార్టీ స్థాపించి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా పార్టీ ప్లీనరీని ఘనంగా నిర్వహించబోతున్నారు.

అయితే ఈ ప్లీనరీలో ఇటు హుజురాబాద్ ఉప ఎన్నికకు, ఇటు ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెట్టే అవకాశం కనిపిస్తోంది.

అయితే గత సంవత్సర కాలంగా ప్రతిపక్షాలకు, టీఆర్ఎస్ పార్టీకి మధ్య మాటల యుద్దం జరుగుతోంది.

అయితే ప్రతిపక్షాల విమర్శలకు టీఆర్ఎస్ అంతగా స్పందించిన పరిస్థితి లేదు.దీంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తే పార్టీ ప్రతిష్టకు భంగం కలిగే అవకాశం ఉండటమే కాదు, రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ కు పెద్ద ఎత్తన నష్టం జరిగే అవకాశం ఉంటుంది.

అందుకే ఇటు ఉద్యోగ  నోటిఫికేషన్ లపై అంతేకాక ఇంకా ప్రభుత్వం పై ప్రజలు అగ్రహంగా ఉన్న అంశాలపై ఈ ప్లీనరీలో ముఖ్యమంత్రి కెసీఆర్ సమాధానం ఇవ్వనున్నారు.

దీంతో అధికార పక్షం  విమర్శలకు ప్రతిపక్షాలు కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంది.

దీంతో మరోసారి ప్రతిపక్షం, అధికార పక్షం మధ్య మాటల తూటాలు పేలే అవకాశం ఉంది.

అయితే ఈ ప్లీనరీతో టీఆర్ఎస్ కార్యకర్తలకు పెద్ద ఎత్తున భరోసా ఇవ్వనున్నారు.ఎందుకంటే క్షేత్ర స్థాయిలో ప్రజాప్రతినిధులు కార్యకర్తలను పట్టించుకోవడం లేదనే విషయం కెటీఆర్ వద్దకు కూడా వెళ్ళిన పరిస్థితుల్లో ప్లీనరీలో కార్యకర్తలను ఉద్దేశించి ఎక్కువ శాతం ప్రసంగించే అవకాశం ఉంది.

ఎందుకంటే ఇక రెండున్నర  సంవత్సరాలలో సార్వత్రిక  ఎన్నికలు జరగనున్న తరుణంలో కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేస్తేనే రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించే అవకాశం ఉంటుంది.

అంతేకాక అసంతృప్తిగా ఉన్న కార్యకర్తలతో కూడా కెటీఆర్ స్వయంగా మాట్లాడే అవకాశం ఉంది.

మరి ప్లీనరీలో టీఆర్ఎస్ అధినేత కెసీఆర్ ఎటువంటి అంశాలను ప్రస్తావిస్తారనేది ఆసక్తి నెలకొంది.

అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా పైన వీడిన సస్పెన్స్ డైరెక్టర్ ఎవరో తెలిసిపోయింది…