దళిత వ్యతిరేకి అనే ముద్రను బీజేపీ ఇక మోయాల్సిందేనా?

రాజకీయాల్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పడం చాలా కష్టం.అధికార పక్షాన్ని ఇరుకున పెట్టడానికి ప్రతిపక్షాలు, ప్రతిపక్షాలను ఇరుకున పెట్టడానికి అధికార పక్షం వ్యూహాలు పన్నడం రాజకీయాల్లో షరామామూలే.

అయితే  పన్నిన ప్రతి వ్యూహం అనేది కొన్ని సార్లు విజయవంతం కాకపోవచ్చు.అంతేకాక ఒకవేళ ఆ వ్యూహం తమనే ఇరుకున  పెట్టే అవకాశం కూడా లేకపోలేదు.

ప్రస్తుతం తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నిక జరుగుతుందన్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరే ఈ ఉప ఎన్నికలో గెలుపొందడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది.

దీంతో ఎవరికి వారు వ్యూహాలు రచించుకుంటూ అధికార పక్షంపై విమర్శల వర్షం కురిపిస్తూ ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది.

అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం తాజాగా దళిత బంధు పధకం ప్రారంభించిన విషయం తెలిసిందే.

అయితే ఈ పధకాన్ని అమలు చేయడానికి హుజూరాబాద్ నియోజకవర్గాన్నే ప్రభుత్వం ఎన్నుకొని ఇప్పటికే కొంత మంది లబ్ధిదారులకు పది లక్షల రూపాయల నగదును లబ్ధిదారుల అకౌంట్ లలో ప్రభుత్వం జమ చేసింది.

కానీ ఇంకా ఈ పధకం లబ్దిదారులకు పూర్తి స్థాయిలో అందలేదు.తాజాగా త్వరలో హుజూరాబాద్ ఉప ఎన్నిక జరగనున్న తరుణంలో దళిత బంధు పధకాన్ని నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే.

అయితే బీజేపీ నేత ప్రేమేందర్  న్యాయ స్థానంలో పిల్ వేశారని, ఎన్నికల సంఘానికి లేఖ రాశారని టీఆర్ఎస్ నేతలు, హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళితులు కూడా బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది.

దీంతో రాష్ట్రం మొత్తం దళితులలో బీజేపీ దళితుల పట్ల వివక్ష చూపుతోందనే విధంగా ప్రజల్లోకి వెళ్ళింది.

మరి బీజేపీకి దళితులు ఎంత వరకు రానున్న రోజుల్లో మద్దతు తెలుపుతారనేది చూడాల్సి ఉంది.

ఆ కంచుకోటల్లో ఈసారైనా బోణీ కొడతారా ?