నంద్యాల సీటును భూమా కుటుంబం వదులుకోవాల్సిందేనా?

భూమా నాగిరెడ్డి, శోభ నాగిరెడ్డి( Bhuma Nagi Reddy) హయాంలో నంద్యాల- ఆళ్లగడ్డ అసెంబ్లీ స్థానాలను తమ కంచుకోటగా భావించిన భూమా ఆ రెండు నియోజక వర్గాలలో తమ హవా నడిపించేది .

అదికారం లో ఉన్నా లేకున్నా తమ అనుకున్నట్టుగానే అక్కడ వ్యవహారాలు నడిచెవి .

అయితే వారి మరణం తర్వాత ఆ నియోజక వర్గం లో కొంత పట్టును కోల్పోయిన మాట వాస్తవం.

ముఖ్యంగా ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన ఏవి సుబ్బారెడ్డి వర్గాన్ని దూరం చేసుకున్న అఖిలప్రియ కొంత ఒంటరి అయ్యారనే చెప్పొచ్చు.

అయినప్పటికీ తమ కుటుంబానికి సంప్రదాయం గా వస్తున్న రెండు స్థానాలను మాత్రం వదులుకోవడానికి ఆమె ఇష్టపడటం లేదు.

నంద్యాల స్థానానికి 2017లో తన కజిన్ అయిన బ్రహ్మానందరెడ్డిని గెలిపించుకున్న అఖిల 2024 లో మాత్రం తన సొంత తమ్ముడైన భూమా జగద్విఖ్యాత రెడ్డికి ఆ సీటు ఇవ్వాలని అధిష్టానం వద్ద పట్టుపడుతుంది.

"""/" / అయితే ఇప్పటికే అక్కడ యాక్టివ్ గా ఉన్న భూమా బ్రహ్మానందరెడ్డి ( Bhuma Brahmananda Reddy )మాత్రం ఆ స్థానాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేరు.

దాంతో సొంత కుటుంభం లోనే వర్గపోరు అఖిలప్రియ కు మొదలైంది .

ఒకపక్క ఏవి సుబ్బారెడ్డి వర్గంపై దాడి తో అధిష్టానం అఖిల ప్రియ పై గుర్రుగా ఉండగా మరోపక్క భూమా బ్రహ్మానందరెడ్డి వర్గం కూడా తమ నియోజకవర్గంలో అఖిలప్రియ అనవసరంగా వేలు పడుతుందని ,అక్కడ ఒక ఆఫీసును కూడా తెరిచి తన హవాను నడిపించే ప్రయత్నం చేస్తుందని బ్రహ్మానంద రెడ్డి వర్గం కూడా అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తుందట.

"""/" / అక్కడ తెలుగుదేశం తరఫున మాజీ డిప్యూటీ స్పీకర్ ఫరూక్ వర్గం కూడా బలంగానే ఉండడంతో అక్కడ సీటు బ్రహ్మానందరెడ్డి కి ఇవ్వాలా లేక ఫరూక్ వర్గానికి ఇవ్వాలా అన్న మీమాంస లో ఉంటే ఇప్పుడు అఖిలప్రియ కూడా అక్కడ వేలుపెట్టడం కొత్త సమస్యలను తీసుకువస్తుందని గుర్తించిన తెలుగుదేశం అధిష్టానం అఖిలప్రియ( Bhuma Akhila Priya )కు నంద్యాల నియోజకవర్గంలో ఎంట్రీ నిషేదించిందని వార్తలు వస్తున్నాయి.

మారేన పరిస్థితుల్లో సర్దుకుపోవాలని ఇప్పటికే అఖిల ప్రియ కు స్పష్టం చేసిన అధిష్టానం నంద్యాల రాజకీయాల్లో వేలు పెట్టొద్దని గట్టిగానే చెప్పినట్లు తెలుస్తుంది .

సొంత సినిమాలనే డైరెక్ట్ చేసుకుంటే వాటి పరిస్థితి ఇలాగే ఉంటుంది.