ఉచిత వేసవి క్రీడా శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla )లో ఉచితంగా అందించనున్న వేసవి క్రీడా శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.

మే 3వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు శిక్షణ కొనసాగనుందని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ వారి ఆదేశాలతో జిల్లా యువజన క్రీడల శాఖ వారి ఆధ్వర్యంలో, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల పట్టణ ప్రాంతములో వేసవి క్రీడా శిక్షణ శిబిరము( Free Summer Sports Camp )లో భాగంగా తేది: మే 03 నుంచి జూన్ 3వ తేదీ దాకా 2024.

జిల్లాలో నీ బాల బాలికలకు ఈ క్రింది క్రీడాంశాలలో ఉచితముగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.

కరాటే,  యోగ,  వాలీబాల్,  టేబుల్ టెన్నిస్, షటిల్ బాడ్మింటన్,  క్రికెట్, బాస్కెట్ బాల్.

విలు విద్య (ఆర్చరీ)కబడ్డీ, అథ్లెటిక్స్ లో శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు.ఆయా క్రీడలో ఉదయము 6.

00 గంటల నుంచి 8.00 గంటల వరకు అలాగే సాయంత్రం 5.

00 గంటల నుంచి 7.00 గంటట వరకు ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ( నాన్ రెసిడెన్సియల్) సిరిసిల్ల పట్టణములోని రాజీవ్ నగర్, మినీ స్టేడియంలో  కొనసాగుతాయని సూచించారు.

ఆసక్తి ఉన్న క్రీడాకారులు 90594 65889, 75692 07411 లో సంప్రదించాలని జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి ఏ రాందాస్ కోరారు.

బిహార్‌: అయ్యో పాపం, కాపాడటానికి వెళ్లిన ఆర్మీ హెలికాప్టర్ కూలిపోయింది!