పుష్ప సినిమా కోసం సునీల్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప.

ఇందులో ప్రతి ఒక్క పాత్రపై సుకుమార్ ప్రత్యేక దృష్టి తీసుకొని ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఇందులో హీరోహీరోయిన్లుగా నటిస్తున్న అటువంటి అల్లు అర్జున్ రష్మికను డీ గ్లామర్ లుక్ లో చూపించబోతున్నారు.

ఇకపోతే ఈ సినిమాలో కమెడియన్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నటుడు సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు మనకు తెలిసిందే.

తాజాగా ఈ సినిమాలోని సునీల్ మంగళం సీను పాత్రలో నటిస్తున్నాడని అతనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్రబృందం విడుదల చేశారు.

ఇందులో ఎరుపెక్కిన కళ్ళతో సునీల్ లుక్ ప్రేక్షకులను భయపెట్టే విధంగా ఉంది.ఈ సినిమా ద్వారా సునీల్ ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారని,దీని తర్వాత ఆయనకు వరుస అవకాశాలు వస్తాయని పలువురు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ సినిమాలోని సునీల్ పాత్ర గురించి ఒక సమాచారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ సినిమాలో చేయడం కోసం సునీల్ భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.మంగళం సీను పాత్రలో చేయడం కోసం సునీల్ ఏకంగా 80 లక్షల పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

"""/"/ ఇక ఈ సినిమాలో సునీల్ భార్య పాత్రలో బుల్లితెర యాంకర్ అనసూయ నటించనుంది.

ఇదివరకే సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ మరోసారి పుష్ప సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది.

ఈ క్రమంలోనే సునీల్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇకపోతే రెండు పార్టులుగా ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారని, మొదటి పార్ట్ ఈ ఏడాది డిసెంబర్ 17వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించారు.

బస్సులో అపరిచితుడు భుజంపై తలవాల్చిన యువతి.. నెక్స్ట్ ఏం జరిగిందంటే..?