రైతులకు అందుబాటులో ఉండాలి : అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్

రాజన్న సిరిసిల్ల జిల్లా: వ్యవసాయశాఖ అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ తెలిపారు.

ఖరీఫ్ సీజన్ సాగుపై జిల్లాలోని ఏఓలు, ఏఈఓలతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియం లో శుక్రవారం సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్( Kheemya Naik) మాట్లాడారు.

ఏఓలు, ఏఈఓలు తమ పరిధిలోని రైతులకు అందుబాటులో ఉండా లని, సాగులో మెలకువలు అందించాలని సూచించారు.

రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసిన తరువాత కచ్చితంగా రసీదు తీసుకోవాలని పేర్కొన్నారు.

లూజ్ విత్తనాలు, ఎలాంటి గుర్తింపు లేని వారి వద్ద విత్తనాలు కొనుగోలు చేయవద్దని స్పష్టం చేశారు.

ప్రభుత్వ, వ్యవ సాయ శాఖ గుర్తింపు ఉన్న పత్తి విత్తనాలు సాగు చేయాలని సూచించారు.

దీనితో ఎలాంటి ఇబ్బంది ఉండదని వివరించారు.వ్యవసాయశాఖ అధికారులు తమ పరిధిలోని దుకాణాల్లో నిత్యం తనిఖీ చేయాలని, స్టాక్ రిజిస్టర్, నిలువలు సరి చూసుకోవాలని ఆదేశించారు.

నిబంధనలకు విరుద్ధంగా కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు.

జిల్లాలోని రైతులు విత్తనాలు, ఎరువుల విషయంలో ఆందోళన పడవద్దని, వ్యవసాయశాఖ అధికారుల సూచన మేరకు విత్తనాలు, ఎరువులు వాడాలని పిలుపు నిచ్చారు.

ఇక్కడ జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.పత్తి రైతులకు సూచనలుఈ వానాకాలం 2024 కి పత్తి విత్తనాలు కొనేముందు తెలుసుకోవాల్సిన విషయాలు*బోల్ గార్డ్ Ii ప్యాకెట్ 864 /- రూపాయలు మాత్రమే విత్తనాలకి సంబంధించి బిల్ (రసీదు) తీసుకోవాలి, మీ గ్రామంలో కానీ, మీ మండలంలో కానీ, మీ జిల్లాలో కానీ అధీకృత (లైసెన్స్) విత్తన డీలర్ దగ్గర మాత్రమే తీసుకోవాలి.

పత్తి పంట యొక్క పత్తి దిగుబడి వచ్చేవరకు పంటకాలం అయిపోయేవరకు బిల్ ( రసీదు ) రైతు దగ్గరనే భద్రపరుచుకోవాలితీసుకున్న బిల్ ( రసీదు) మీద విత్తన కంపెనీ పేరు, విత్తన రకం, బ్యాచ్ నెంబర్, లాట్ నెంబర్, రేటు ఉండాలి విత్తన ప్యాకెట్ మీద తయారైన తేదీ, కాలం ముగిసిన తేదీ చూసుకోవాలి ప్రతి విత్తన ప్యాకెట్ మీద Geac నెంబర్ ఉందా లేదా చూసుకోవాలిగ్రామాలలో తక్కువ ధరకు, ఎక్కువ ధరకు అమ్మే వారి వివరాలు మీ మండల వ్యవసాయ అధికారికి చెప్పండిపక్క జిల్లా నుండి పక్క రాష్ట్రాల నుండి తీసుకొచ్చి ఎవరైనా నకిలీ విత్తనలు, లూస్ విత్తనాలు అమ్మినచో మాకు ఫోన్ లో సంప్రదించండి.

దయచేసి తొందరపడి అధీకృత (లైసెన్స్) డీలర్ దగ్గర కాకుండా ఇతరుల దగ్గర విత్తనాలు తీసుకొని ఇబ్బంది పడకూడదు.

అల్లు అర్జున్ ను ఆదర్శంగా తీసుకుంటే అందరూ పాన్ ఇండియా హీరోలే అవుతారా..?