ఐతే నయన్ దంపతులపై కేసు నమోదు చేయాలా?

లేడీ సూపర్ స్టార్ నయనతార మరియు ఆమె భర్త విగ్నేష్ శివన్‌ తాజాగా తల్లిదండ్రులైన విషయం తెలిసిందే.

సరోగసి విధానం ద్వారా వీరు కవల కొడుకులకు జన్మనిచ్చారు.ఇటీవల తాము తల్లిదండ్రులం అయ్యాం అంటూ ఆ కావల కొడుకుల యొక్క పాదాలను చూపిస్తూ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

చాలామంది అభిమానులు వారి జంటకు అభినందనలు తెలియజేస్తున్నారు.కొందరు కన్ఫ్యూజ్ అయ్యి పెళ్లి అయిన సంవత్సరం లోపే ఎలా ఇది జరిగింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

పెళ్లికి ముందే సరోగసి విధానం ద్వారా తల్లిదండ్రులు అవ్వాలని వారు నిర్ణయించుకున్నారు అందుకే సరోగసికి వెళ్లారు అయితే ఈ సరోగసి విధానం ఎక్కడ జరిగింది అనేది క్లారిటీ లేదు.

ఈ సమయంలో సీనియర్ హీరోయిన్ కస్తూరి సోషల్ మీడియా ద్వారా ఇండియాలో సరోగసి బ్యాన్ చేయడం జరిగింది, ఇండియాలో సరోగసి విధానంతో పిల్లలకు జన్మనిచ్చే అవకాశం లేదు అంటూ ఆసక్తికర విషయాన్ని లేవనెత్తింది.

ఆమె వెల్లడించిన విషయం కచ్చితంగా నయనతార జంటకు వర్తిస్తుంది అనడంలో సందేహం లేదు.

"""/"/ ఇండియాలో చట్టపరంగా అనుమతి లేని సరోగసి విధానంలో నయనతార మరియు విగ్నేష్ లు ఎలా తల్లిదండ్రులు అయ్యారు అంటూ కొందరు విమర్శిస్తున్నారు.

ఈ విషయమై వారిద్దరిపై పోలీసు కేసు నమోదు అయితే సీరియస్ గా పరిస్థితి మారే అవకాశం కూడా లేక పోలేదు.

ఇండియాలో చట్టబద్ధం కానీ సరోగసి విధానంలో పిల్లలను కన్నందుకు గాను వారిపై కేసు నమోదు చేయాల్సిందే అంటూ కొందరు డిమాండ్ చేస్తుంటే, ఈ విషయంలో అనవసర రాద్ధాంతం చేయకుండా ఎవరి పనులు వారు చూసుకుంటే బాగుంటుందని నయనతార అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ విషయం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.

ఈ చర్చ ఎక్కడికి దారి తీస్తుందో అనే ఆందోళన కొందరులో వ్యక్తం అవుతుంది.

ప్రస్తుతం సోషల్ మీడియాతో పాటు అన్ని మీడియా లో కూడా నయనతార దంపతులు తల్లిదండ్రులు అయిన విషయమై ప్రముఖంగా చర్చ జరుగుతుంది.

ఇంతలో కస్తూరి ట్వీట్‌ చేయడంతో చర్చ కాస్త పూర్తిగా అటు వైపు మరలే అవకాశం ఉందంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

దేవర సీక్వెల్ లో దేవర ఉంటాడా.. ఈ ప్రశ్నకు జూనియర్ ఎన్టీఆర్ జవాబిదే!