Gurpatwant Pannun : మొన్న నిజ్జర్ మిత్రుడు.. నేడు పన్నూ స్నేహితుడి ఇంటిపై కాల్పులు , కెనడాలో ఏం జరుగుతోంది..?
TeluguStop.com
ఖలిస్తాన్ ఉగ్రవాదులు, మద్ధతుదారుల నిరసనలతో ఇప్పటికే కెనడా( Canada ) అట్టుడుకుతోన్న సంగతి తెలిసిందే.
ఇలాంటి దశలో ఖలిస్తాన్ వేర్పాటువాద సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్‌జే)( Sikhs For Justice ) వ్యవస్ధాపకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూన్( Gurpatwant Singh Pannun ) సన్నిహితుడు ఇందర్‌జిత్ సింగ్ గోసల్( Inderjeet Singh Gosal ) ఇంటిపై కాల్పులు జరగడం కలకలం రేపింది.
గ్రేటర్ టొరంటో ఏరియాలో సోమవారం ఈ ఘటన జరిగింది.ఈ సంఘటన గురించి పోలీసులు ఎలాంటి బహిరంగ ప్రకటన చేయలేదు.
సిక్కు వేర్పాటువాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య జరిగి ఎనిమిదో నెల పూర్తయిన సందర్భంగా ఫిబ్రవరి 17న టొరంటోలోని భారత కాన్సులేట్ వెలుపల జరగనున్న నిరసనకు గోసల్ నేతృత్వం వహిస్తున్నాడు.
కాల్పుల ఘటనపై గోసల్ ఓ ప్రకటన విడుదల చేశాడు.తాను భారత కాన్సులేట్ ముందు నిరసనలకు నాయకత్వం వహిస్తున్నానని, నిజ్జర్‌ను భారతీయ ఏజెంట్లు హత్య చేశారని ఆరోపించాడు.
ఖలిస్తాన్( Khalistan ) రెఫరెండం కోసం ప్రచారం చేయడం వల్లనే తనను లక్ష్యంగా చేసుకున్నారని గోసల్ పేర్కొన్నాడు.
ఖలిస్తాన్ రెఫరెండంను ఆపడానికి హింసను ఉపయోగిస్తుంటే.ఖలిస్తాన్ అనుకూల సిక్కులపై దాడులు కొనసాగితే దీనికి న్యూఢిల్లీ బాధ్యత వహించాల్సి వుంటుందని పన్నూన్ హెచ్చరించాడు.
"""/" /
ఇకపోతే.గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌ను హత్య చేసేందుకు కుట్రపన్నిన కేసులో నిఖిల్ గుప్తా( Nikhil Gupta ) అనే భారతీయులు ప్రస్తుతం చెక్ రిపబ్లిక్ నిర్బంధంలో వున్నాడు.
పన్నూన్‌ను హత్య చేసేందుకు నిఖిల్ సుపారీ కిల్లర్‌తో ఒప్పందం చేసుకున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.
ఇతనిని తమకు అప్పగించాల్సిందిగా అమెరికా ఆ దేశాన్ని కోరుతోంది.కాగా.
నిజ్జర్ సన్నిహితుడు సిమ్రంజీత్ సింగ్( Simranjeet Singh ) ఇంటిపై కాల్పులు జరిగిన వ్యవహారం కెనడాలో కలకలం రేపిన సంగతి తెలిసిందే.
"""/" /
దీనిపై సీరియస్‌గా దృష్టి పెట్టిన ప్రభుత్వం, పోలీసులు ఇద్దరు అనుమానితులను అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది.
సిమ్రంజీత్ సింగ్‌కు చెందిన సర్రే ఇంటిలో ఫిబ్రవరి 1వ తేదీ తెల్లవారుజామున 1.
20 గంటల సమయంలో కాల్పులు జరిగాయి.రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ (ఆర్‌సీఎంపీ) సర్రే యూనిట్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.
ఫిబ్రవరి 6న 140 స్ట్రీట్‌లోని 7700 బ్లాక్‌లోని నివాసంపై తమ క్రైమ్ యూనిట్ సెర్చ్ వారెంట్‌ను అమలు చేసినట్లు తెలిపారు.
మాట నిలబెట్టుకున్న న్యూయార్క్ మేయర్.. స్కూళ్లకు దీపావళి సెలవు