షాకింగ్ వీడియో: స్నాచర్‌ని నేలకూల్చిన మహిళ.. ఆ మూమెంట్ చూస్తే వావ్ అనాల్సిందే!
TeluguStop.com
బ్రెజిల్‌లో జరిగిన ఒక షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఒక ధైర్యవంతురాలైన మహిళ దొంగను చాలా డ్రామాటిక్‌గా ఆపిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
దీన్ని స్పోర్ట్స్ కామెంటేటర్ స్టీవ్ ఇన్మాన్ 'ఎక్స్' (X)లో "హావ్ ఏ సీట్" (Have A Seat!) అనే క్యాప్షన్‌తో షేర్ చేశాడు.
ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.వీడియోలో ఒక రెస్టారెంట్ ముందు ఒక మహిళ తన స్నేహితురాలితో కలిసి హాయిగా స్నాక్స్ తింటూ కబుర్లు చెబుతూ ఉంది.
అంతా మామూలుగానే ఉంది అనుకునేలోపు, ఆమెకు ఏదో తేడాగా అనిపించింది.క్షణాల్లో ఒక దొంగ సైకిల్‌పై వేగంగా దూసుకొచ్చాడు.
ఎవరో మహిళ దగ్గర నుంచి విలువైన వస్తువులు లాక్కొని పారిపోతున్నాడు.దొంగ తప్పించుకుని పోయేలోపే, ఆ మహిళ మెరుపు వేగంతో స్పందించింది.
పక్కనే ఉన్న కుర్చీని అందుకుని బలంగా విసిరింది.కుర్చీ నేరుగా దొంగ ముఖానికి తగలడంతో అతను సైకిల్‌పై నుంచి కింద పడిపోయాడు.
దెబ్బకి తేరుకోలేక నేలపైనే కొట్టుమిట్టాడుతూ లేవడానికి తెగ ప్రయత్నించాడు.అతను లేవడానికి ప్రయత్నిస్తుండగానే, చుట్టుపక్కల ఉన్న జనం ఒక్కసారిగా అతనిపైకి ఉరికారు.
దొంగ చేసిన పనికి కోపం కట్టలు తెంచుకుని, జనం అతన్ని చితకబాదారు.పోలీసులు వచ్చేలోపే దొంగకి బాగా వాతలు తేలేలా కొట్టారు.
"""/" /
ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయింది.వేలాది మంది మహిళా ధైర్యసాహసాల్ని, ఆమె చురుకైన బుద్ధిని మెచ్చుకుంటున్నారు.
'ఎక్స్'లో ఒక యూజర్ కామెంట్ చేస్తూ "ఆమె చాలా ధైర్యవంతురాలు" అని పొగిడారు.
ఇంకొకరు "ఆమె క్షణాల్లో పరిస్థితిని అర్థం చేసుకుని పర్ఫెక్ట్ మూవ్ వేసింది" అని కామెంట్ చేశారు.
చాలా మంది ఆమెను హీరోయిన్‌గా కొలుస్తుంటే, మరికొందరు దొంగకి తగిన శాస్తి జరిగిందని అంటున్నారు.
ఈ ఘటన ఆన్‌లైన్‌లో పెద్ద చర్చకు దారితీసింది.మహిళ చూపిన తెగువకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.
వైరల్ వీడియో: భర్త అంటే ఇంత ప్రేమ ఉండి, ఎందుకు విడాకులు?