షాకింగ్ వీడియో: పట్టపగలే నడిరోడ్డుపై మహిళ మెడలో నుంచి గొలుసు లాక్కెళ్ళిన దొంగలు.. జాగ్రత్త సుమీ..

తాజాగా దేశ వ్యాప్తంగా కొంతమేర దొంగల బెడద ఎక్కువైంది.ఇకపోతే ఈ మధ్య కాలంలో ఘజియాబాద్‌లో( Ghaziabad ) అక్రమార్కుల మనోధైర్యం బాగా పెరిగింది.

తాజాగా నగరంలోని పోష్ ఏరియాలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళ నుంచి దుండగులు చైన్ లాక్కొని పారిపోయారు.

వనస్థలి స్కూల్ సమీపంలో రోడ్డుపై ఓ మహిళ పై దుండగులు ఒక్కసారిగా చైన్ స్నాచింగ్‌ ( Chain Snatching )కు పాల్పడ్డారు.

ఈ దృశ్యాలు సమీపంలోని ఓ ఇంట్లో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. """/" / మహిళా రోడ్డుపై నడుస్తున్న సమయంలో అక్కడకు బైక్‌ పై వచ్చిన ఇద్దరు అగంతకులు మెడలోంచి గొలుసును ఒక్కసారిగా లాగారు.

గొలుసును దుండగులు లాక్కెళ్లడంతో షాక్‌ కు గురైన మహిళ.ఒక్కసారిగా వారి చైన్ లాగడంతో రోడ్డుపై పడిపోవడం వీడియోలో కనిపిస్తోంది.

మహిళ మెడలోంచి గొలుసు తెంచుకుని దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.ఈ ఘటనలో మహిళకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం.

ఈ చైన్ స్నాచింగ్ కేసు ఇందిరాపురం సెక్టార్ 7 పోలీస్ స్టేషన్ ( Indirapuram Sector 7 Police Station )పరిధిలో నమోదైంది.

నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. """/" / ఘజియాబాద్‌లో నేరాలు ఈ మధ్య మరి ఎక్కువ అయినట్లు సమాచారం.

దొంగతనాలు, దాడులు రోజురోజుకు వెలుగులోకి వస్తున్నాయి.కొద్దిరోజుల క్రితమే జయనగర్‌ లోని ఓ మనీ ట్రాన్స్‌ఫర్ ఏజెంట్ నుంచి కొందరు దుండగులు వేల విలువైన నగదును దోచుకెళ్లారు.

ముసుగులు ధరించిన దుండగులు కౌంటర్ లోపలి భాగంలోకి వచ్చి బ్యాగులో ఉంచిన రూ.

50 వేలు దోచుకెళ్లి పారిపోయారు.ఈ ఘటనలో నిందితులు ఇప్పటికీ పోలీసులకు దొరకలేదు.

ప్రస్తుతం చైన్ స్నాచింగ్‌ సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.కాబట్టి ఒంటరిగా రోడ్లపై వెళ్తున్న సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి.