IPhone 15 Charger : పొగలు కక్కుతూ కాలిపోయిన ఐఫోన్ 15 ఛార్జర్.. షాకింగ్ వీడియో వైరల్..
TeluguStop.com
యాపిల్ ఐఫోన్లు చాలా క్వాలిటీ యాక్సెసరీలతో వస్తాయి.అందువల్ల ఈ ఫోన్లు ఫైర్ ఇన్‌సిడెంట్స్‌కు గురి కావడం చాలా అరుదు.
అయితే తాజాగా ఒక వీడియో మాత్రం ఐఫోన్ యూజర్లలో గుబులు రేపుతోంది.ప్రస్తుతం ఐఫోన్ 15 ఛార్జర్‌కు( IPhone 15 Charger ) మంటలు అంటుకున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.
జాస్మిన్ అహ్లువాలియా( Jasmine Ahluwalia ) అనే మహిళ ఫిబ్రవరి 17న ఈ వీడియోను పోస్ట్ చేసింది.
రాత్రి ఛార్జింగ్‌లో ఉన్న ఐఫోన్ 15ను వినియోగిస్తున్నానని, అకస్మాత్తుగా, వైర్ కేబుల్ కాలిపోవడంతో తన చేయి కాలిందని వీడియోలో ఆమె ఆరోపించింది.
"""/" /
పొగ వాసన వస్తూ ఛార్జర్ చుట్టూ స్మోక్ కమ్ముకోవడం చూసి తాను ఆందోళనకు లోనయ్యానని చెప్పింది.
అది గమనించకుంటే పెద్ద అగ్నిప్రమాదం జరిగేదని పేర్కొంది.కొత్త ఫోన్లను విక్రయించే ముందు వాటి నాణ్యతను తనిఖీ చేయాలని ఆమె యాపిల్‌ను కోరింది.
ఈ వీడియో లక్ష కంటే ఎక్కువ వ్యూస్ తో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది.
"""/" /
ఈ వీడియోపై కొందరు వ్యాఖ్యానిస్తూ అహ్లువాలియాకు మద్దతు తెలిపారు.తాము ఒరిజినల్ ఛార్జర్, వైర్‌తో ఐఫోన్ 15 కొనుగోలు చేసినట్లు తెలిపారు.
సమీపంలోని యాపిల్ స్టోర్‌కు వెళ్లి రీప్లేస్‌మెంట్ కేబుల్ కొనాలని, ఫోన్ ఒకసారి చెక్ చేయించుకోవడం మంచిదని వారు ఆమెకు సలహా ఇచ్చారు.
కొందరు వ్యక్తులు అహ్లువాలియాను అనుమానించారు.ఆమె ఫేక్ ఛార్జర్ లేదా అడాప్టర్‌ను ఉపయోగిస్తుందేమో అని ఆరోపించారు.
వ్యూస్, అటెన్షన్ కోసం ఆమె ఇలాంటి ఫేక్ వీడియోలు షేర్ చేస్తుందేమో అని కొందరు కామెంట్లు చేశారు.
డ్యామేజ్ కాకుండా ఉండాలంటే ఒరిజినల్ అడాప్టర్‌తో పాటు ఒరిజినల్ కేబుల్ కూడా ఉపయోగించాల్సి ఉందని వారు తెలిపారు.
ఐఫోన్ ఛార్జర్‌లో మంటలు రావడం ఇదే మొదటిసారి కాదు.జనవరిలో, ఒహియోలోని ఒక కుటుంబం వారు నిద్రిస్తున్నప్పుడు వారి ఐఫోన్‌లు పేలింది.
ఈ అగ్ని ప్రమాదం నుంచి కుటుంబం ప్రాణాలతో తప్పించుకుంది.వారి సెక్యూరిటీ కెమెరాల్లో ఈ ఘటన రికార్డయింది.
షాకింగ్: మరో 8 ఏళ్ల చిన్నారి గుండెపోటుతో మృతి.. గుండెల్ని పిండేస్తోన్న వీడియో..