లోనవాలా జలపాతంలో కొట్టుకుపోయిన ఐదుగురు కుటుంబ సభ్యులు.. షాకింగ్ వీడియో వైరల్..?
TeluguStop.com
గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా లోనావాలాలోని ( Lonavala )ప్రముఖ పర్యాటక ప్రదేశమైన భుషి డ్యామ్ నీటి మట్టం చాలా పెరిగిపోయింది.
ఈ నీటి ఉధృతిని చూసేందుకు చాలామంది వస్తున్నారు.అలాగే సమీపంలో ఉన్న జలపాతాన్ని వీక్షించేందుకు ప్రజలు పోటెత్తుతున్నారు.
ఆదివారం సాయంత్రం ఒక కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు డ్యామ్ సమీపంలో ఉన్న జలపాతం వద్దకు వెళ్లారు.
పెరుగుతున్న నీటి ప్రవాహంలో వాళ్లు చిక్కుకున్నారు.చివరికి ఆ ఐదుగురు కుటుంబ సభ్యులు నీటిలో కొట్టుకుపోయారు.
"""/" /
దురదృష్టవశాత్తు, ఈ ఘటనలో ఒక చిన్నారి కూడా మృతి చెందాడు.
మరో చిన్నారి ఇంకా కనిపించడం లేదు.మిగిలిన ముగ్గురు కుటుంబ సభ్యులు( Three Family Members ) ప్రాణాలూ జల సమాధి అయ్యాయి.
ఈ ఘటన స్థానికంగా చాలా ఆందోళన కలిగించింది.టూరిస్టులు ఈ ప్రాంతానికి వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
ఈ ఘటన చాలామంది హృదయాలను కలచివేసింది.కొట్టుకుపోయిన వారిలో ఇద్దరు చిన్నారులు, 36 సంవత్సరాల వయసు మహిళ మృతదేహాలు ఆదివారం రోజునే బయటపడ్డాయి.
"""/" /
మరో 9 సంవత్సరాల మృతి చెందిన మరియా అన్సారి ( Maria Ansari )మృతదేహాన్ని సోమవారం నాడు ఘటన స్థలానికి దగ్గరలో ఉన్న రిజర్వాయర్లో కనుగొన్నారు.
4 సంవత్సరాల అడ్నాన్ సబాహత్ అన్సారి కోసం గాలింపు ఇంకా కొనసాగుతోంది.ఈ కుటుంబ సభ్యులు కొట్టుకుపోయే ముందు, కొట్టుకుపోతున్నప్పుడు తీసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఆ వీడియోలో బాధితులతో పాటు 9-10 మంది వరద నీళ్లు పారుతున్న సెలయేరు మధ్యలో చిక్కుకుపోయి, సహాయం కోసం అరుస్తున్నారు.
వారి కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు వారిని పట్టుకోమని చెబుతున్న దృశ్యాలు ఉన్నాయి.
కానీ, వరదనీటి ప్రవాహం పెరిగే కొద్దీ ఒక మహిళ ఇద్దరు చిన్నారులను ఎత్తుకుని కొట్టుకుపోయింది.
వారి వెంటే మిగిలిన వాళ్లు కూడా కొట్టుకుపోయారు.
బన్నీ వివాదం గురించి జానీ మాస్టర్ రియాక్షన్ ఇదే.. అందరికీ మంచి జరగాలని చెబుతూ?