మనోజ్ అయిపోయాడన్నారు.. తిరిగి రాడన్నారు.. ఆ షోతో మనోజ్ సంచలనం సృష్టిస్తారా?
TeluguStop.com
మంచు ఫ్యామిలీ( Manchu Family ) నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరోలలో మంచు మనోజ్( Manchu Manoj ) ఒకరు.
జయాపజయాలకు అతీతంగా మంచు మనోజ్ కెరీర్ ను కొనసాగిస్తుండగా ప్రస్తుతం వాట్ ద ఫిష్ అనే సినిమాలో మంచు మనోజ్ నటిస్తున్నారు.
ఈ సినిమాతో మనోజ్ మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి రావాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.
అయితే ఈటీవీ విన్ ఓటీటీ వేదికగా మంచు మనోజ్ హోస్ట్ గా ఒక షో త్వరలో ప్రారంభం కానుందని సమాచారం అందుతోంది.
ఈ షో ప్రోమోలో మంచు మనోజ్ రీఎంట్రీ గురించి తన వాయిస్ ను వినిపించగా అందుకు సంబంధించిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మంచు మనోజ్ ప్రోమోలో నా ప్రపంచం సినిమా అని నేను చిన్నప్పటి నుంచి సినిమా మీద పెంచుకున్న ప్రేమ నా ప్రొఫెషన్ గా మారిందని కామెంట్లు చేశారు.
"""/" /
నన్ను ఒక నటుడిగా, హీరోగా చేసిందని మనోజ్ చెప్పుకొచ్చారు.రాకింగ్ స్టార్ అనే ఒక పేరు కూడా ఇచ్చిందని ఆయన వెల్లడించారు.
ఫ్యాన్స్, విజిల్స్, అరుపులు, కేకలు ఇలా ఒక పండుగలా జరిగిన నా జీవితంలో అకస్మాత్తుగా ఒక ఒక సైలెన్స్ వచ్చిందని మనోజ్ అయిపోయాడని అన్నారని కెరీర్ ఖతం అన్నారని మనోజ్ కామెంట్లు చేశారు.
యాక్టింగ్ ఆపేశాడని ఇక తిరిగి రాడని అన్నారని మనోజ్ చెప్పుకొచ్చారు. """/" /
ఎనర్జీ స్టార్ లో ఎనర్జీ తగ్గిందని అన్నారని మనోజ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఆ కామెంట్లను విన్నానని చూశానని మౌనంగా భరించానని తిరిగొస్తున్నానని మనోజ్ పేర్కొన్నారు.ఈ టాక్ షోను ప్రముఖ సంస్థలలో ఒకటైన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ( People Media Factory ) నిర్మిస్తోంది.
ఈ షో మనోజ్ కెరీర్ ను ఏ స్థాయిలో మలుపు తిప్పుతుందో చూడాల్సి ఉంది.
ఈ టాక్ షోతో మనోజ్ సంచలనం సృష్టించే అవకాశాలు అయితే ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గేమ్ ఛేంజర్ లో చరణ్ ట్రిపుల్ రోల్ లో కనిపిస్తారా.. వైరల్ వార్తల్లో నిజమెంత?