మహేష్ జక్కన్న మూవీ బిజినెస్ లెక్కలివే.. ఆ రికార్డ్ సాధించే తొలి సినిమా కానుందా?
TeluguStop.com
మహేష్ ,రాజమౌళి( Mahesh, Rajamouli ) కాంబో మూవీ అంతకంతకూ ఆలస్యమవుతున్నా ఈ సినిమా ఎప్పుడు విడుదలైనా హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఈ సినిమా బడ్జెట్ 1000 కోట్ల రూపాయలు అని ఇప్పటికే పదుల సంఖ్యలో కథనాలు ప్రచారంలోకి వచ్చాయి.
అయితే తమ్మారెడ్డి భరద్వాజ( Tammareddy Bharadwaja ) తాజాగా ఈ సినిమా గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ ఈ సినిమా బడ్జెట్ 1000 కోట్ల రూపాయలు క్రాస్ చేయవచ్చని అంచనా వేస్తున్నారని ఈ సినిమాలో ఇంటర్నేషనల్ ఆర్టిస్టులు( International Artists ) నటించనున్నారని చెప్పుకొచ్చారు.
ఈ సినిమా బిజినెస్ సైతం 2000 కోట్ల రూపాయలు క్రాస్ చేయవచ్చని టీమ్ భావిస్తోందని ఆయన తెలిపారు.
అంతకు మించి ఎంతైనా వసూలు చేయొచ్చని ఆయన వెల్లడించారు. """/" /
మహేష్ రాజమౌళి కాంబో మూవీ 3,000, 4000 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధిస్తే అది చరిత్ర అవుతుందని తమ్మారెడ్డి తెలిపారు.
ఈ సినిమా బిజినెస్ ను ఊహించడం కూడా కష్టమని ఆయన చెప్పుకొచ్చారు.జక్కన్న భవిష్యత్తును బాగా ఊహిస్తారని తమ్మారెడ్డి వెల్లడించారు.
ఆర్ రిలీజ్ తర్వాత 300 కోట్ల బడ్జెట్ చిన్న బడ్జెట్ అయిందని ఆయన పేర్కొన్నారు.
"""/" /
రాజమౌళి తన విజన్ తో ఇండస్ట్రీ స్థితిగతులనే మార్చేశారని తమ్మారెడ్డి వెల్లడించారు.
మహేష్ జక్కన్న కాంబో మూవీ రిలీజైన తర్వాత ప్రపంచం తెలుగు సినిమా గురించి మాట్లాడుకుంటుందని ఆయన పేర్కొన్నారు.
తమ్మారెడ్డి భరద్వాజ చేసిన కామెంట్లు అటు మహేష్ ఫ్యాన్స్ కు ఇటు జక్కన్న ఫ్యాన్స్ కు ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నాయి.
మహేష్ జక్కన్న కాంబో సినిమాకు సంబంధించి త్వరలో అధికారికంగా క్రేజీ అప్ డేట్స్ వస్తాయేమో చూడాల్సి ఉంది.
జక్కన్న ఊహలకు అందని మరో అద్భుతాన్ని మహేష్ బాబు సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఆవిష్కరించనున్నారని ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఆ రెండు దేశాలలో ప్రభాస్ కంటే ఎక్కువ క్రేజ్ ఉన్న టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా?