చిరంజీవిని అనిల్ అలా చూపించనున్నారా.. ఆ సినిమాను మించిన హిట్ గ్యారంటీ!

చిరంజీవి , అనిల్ రావిపూడి( Chiranjeevi, Anil Ravipudi ) కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.

అనిల్ రావిపూడి సైతం సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు.

అయితే చిరంజీవి అనిల్ రావిపూడి కాంబో సినిమాకు సంబంధించి ఆసక్తికర అప్ డేట్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతోంది.

చిరంజీవికి అనిల్ రావిపూడి ఇప్పటికే బేసిక్ ఐడియా చెప్పగా ఆ ఐడియా మెగాస్టార్ కు ఎంతగానో నచ్చిందని సమాచారం.

ఈ మధ్య కాలంలో వాల్తేరు వీరయ్య మినహా సరైన సక్సెస్ లేని చిరంజీవి అనిల్ రావిపూడితో వర్క్ చేయాలని ఆయన అభిమానులు సైతం అభిమానిస్తున్నారు.

త్వరలో అనిల్ వైజాగ్ లో తన టీమ్ తో కలిసి స్క్రిప్ట్ వర్క్ చేయనున్నారని నెల రోజుల అనంతరం ఫైనల్ నేరేషన్ ఇవ్వనున్నారని సమాచారం.

"""/" / మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్ ( Comedy Timing )కు సైతం ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.

చిరంజీవిని సరిగ్గా తెరపై చూపిస్తే ఏ రేంజ్ లో సంచలనాలు క్రియేట్ అవుతాయో ఇప్పటికే చాలా సినిమాలు ప్రూవ్ చేశాయి.

చిరంజీవి అనిల్ రావిపూడి కాంబో సైతం అదే స్థాయిలో బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ క్రియేట్ చేసే ఛాన్స్ అయితే ఉంది.

చిరంజీవి అనిల్ కాంబో మూవీ షైన్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్ ( Shine Screen Cinemas Banner )పై తెరకెక్కే ఛాన్స్ అయితే ఉంది.

"""/" / సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

సంక్రాంతికి వస్తున్నాం వెంకటేశ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవగా సీనియర్ హీరోల స్టైల్ కు అనుగుణంగా సినిమాలను తెరకెక్కిస్తూ అనిల్ రావిపూడి సత్తా చాటుతున్నారు.

అనిల్ రావిపూడి బలం కామెడీ కాగా ఈ దర్శకుడికి ఇండస్ట్రీలో తిరుగులేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి27, సోమవారం 2025