సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో షాకింగ్ ట్విస్ట్.. అతడి వేలిముద్రలు ఎక్కడా దొరకలేదా?
TeluguStop.com
ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్( Saif Ali Khan ) పై దాడి ఘటన సోషల్ మీడియా వేదికగా ఒకింత సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
దుండగుడి దాడిలో గాయపడిన సైఫ్ అలీ ఖాన్ ఆ గాయం నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
అయితే ఈ కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుందని సమాచారం అందుతోంది.ఈ కేసులో నిందితుడి పేరు షరీఫుల్ ఇస్లాం( Shariful Islam ) కాగా పోలీసులు ఇప్పటికే అతడి వేలిముద్రలను సేకరించారు.
అయితే ఆ వేలిముద్రలు( Fingerprints ) దాడి జరిగిన ప్రదేశంలో లభించిన వేలిముద్రలతో సరిపోలడం లేదని తెలుస్తోంది.
ఈ నెల 16వ తేదీన నిందితుడు సైఫ్ ఇంట్లోకి ప్రవేశించి దాడి చేయగా ఈ ఘటన దేశవ్యాప్తంగా ఒకింత సంచలనం అయింది.
విచారణలో భాగంగా పోలీసులు, ఫోరెన్సిక్ బృందం మొత్తం 19 వేలిముద్రలను సేకరించారని సమాచారం అందుతోంది.
అయితే ఈ 19 వేలిముద్రలలో ఏ వేలిముద్రతో కూడా నిందితుడి ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ కాలేదని సమాచారం అందుతోంది.
"""/" /
మళ్లీ ఘటనా స్థలం నుంచి వేలిముద్రలను సేకరించి తదుపరి పరీక్షలను నిర్వహించనున్నారని తెలుస్తోంది.
సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసుకు సంబంధించి ప్రజల్లో సైతం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.
ఈ వివాదం సైఫ్ కెరీర్ పై కూడా కొంతమేర ప్రభావం చూపే ఛాన్స్ అయితే ఉంది.
సైఫ్ అలీ ఖాన్ తెలుగులో దేవర సినిమాలో( Devara ) నటించిన సంగతి తెలిసిందే.
"""/" /
దేవర మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో పాటు మంచి లాభాలను సొంతం చేసుకుంది.
భైరా పాత్రకు నెటిజన్ల నుంచి, ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.సైఫ్ అలీఖాన్ రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలోనే ఉందని సమాచారం అందుతోంది.
సైఫ్ కు తెలుగులో వరుస ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది.
తండేల్ తో సాయి పల్లవి నాగ చైతన్యకి సక్సెస్ ఇస్తుందా..?