పెంపుడు కుక్కకు బిజినెస్ క్లాస్ టికెట్ కావాలని రష్మిక కోరిందా.. ఏమైందంటే?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన రష్మిక మందన్నా పుష్ప ది రైజ్ సక్సెస్ తో మరో సక్సెస్ ను అందుకున్నారు.

రష్మిక నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు ఫ్లాప్ అయినా ఈ సినిమా ఫెయిల్యూర్ రష్మిక కెరీర్ పై పెద్దగా ప్రభావం చూపలేదనే సంగతి తెలిసిందే.

అయితే సోషల్ మీడియాలో రష్మికకు సంబంధించి ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి.తాజాగా రష్మిక పెంపుడు కుక్కకు బిజినెస్ క్లాస్ టికెట్ కావాలని నిర్మాతను అడిగిందని ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది.

వైరల్ అయిన వార్తను విని నెటిజన్లు సైతం షాకయ్యారు.స్టార్ హీరోయిన్ రష్మిక ఇలా చేయడం ఏమిటని సందేహాలను వ్యక్తం చేశారు.

అయితే వైరల్ అవుతున్న వార్తలు తన దృష్టికి రావడంతో ఈ వార్తలు తన పరువుకు భంగం కలిగించేలా ఉండటంతో రష్మిక ఈ వార్తల గురించి స్పందించి క్లారిటీ ఇచ్చారు.

ఇలాంటి రూమర్లను ఏ విధంగా సృష్టిస్తారో తనకు అర్థం కాదని రష్మిక వెల్లడించారు.

నా పెంపుడు కుక్క పేరు ఆరా అని నా కుక్క నాతో కలిసి ప్రయాణించాలని మీరు అనుకున్నా కుక్కకు మాత్రం ఫ్లైట్ లో ప్రయాణించడం ఇష్టం ఉండదని ఆమె కామెంట్లు చేశారు.

హైదరాబాద్ లో కుక్క హ్యాపీగా ఉందని ఆమె కామెంట్లు చేశారు.ఈ వార్తను చూసి నేను నవ్వు ఆపుకోలేకపోతున్నానని ఆమె చెప్పుకొచ్చారు.

రష్మిక స్పందించిన నేపథ్యంలో ఇకనైనా ఈ వార్తలు ఆగిపోతాయేమో చూడాలి. """/"/ సాధారణంగా గాసిప్స్ గురించి స్పందించడానికి రష్మిక ఇష్టపడరు.

అయితే వైరల్ అవుతున్న రూమర్లు మరీ సిల్లీగా ఉండటంతో పాటు నిర్మాతల దృష్టిలో రష్మిక గురించి తప్పుగా అభిప్రాయాన్ని సృష్టించేలా ఉన్నాయి.

రష్మిక ప్రస్తుతం పుష్ప ది రూల్ తో పాటు పలు బాలీవుడ్ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.

మొటిమలు మచ్చలను పోగొట్టి ముఖాన్ని తెల్లగా మెరిపించే ఎఫెక్టివ్ రెమెడీ ఇది..!