త్రివిక్రమ్‌ – పూజా హెగ్డే పిచ్చి పుకార్లు… వాళ్లకి ఏం పనిలేదు

సోషల్ మీడియా లో ఈ మధ్య కాలంలో సెలబ్రిటీల గురించి పలు రకాలుగా పుకార్లు ప్రచారం చేయడం కామన్ అయింది.

ఎంతగా కాదనుకున్నా.ఎంతగా వద్దనుకున్నా కూడా అబద్ధపు ప్రచారాలు కొనసాగుతూనే ఉన్నాయి.

గతంలో పలుసార్లు ప్రముఖులు అబద్ధపు పుకార్ల పై మండి పడ్డ కూడా కొందరు అసత్యపు ప్రచారాలు చేస్తూనే ఉన్నారు.

తాజాగా మరో సారి త్రివిక్రమ్ ( Trivikram ) మరియు పూజ హెగ్డే( Pooja Hegde ) గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతూ సోషల్ మీడియా లో ఎవరికి తోచిన విధంగా వారు కామెంట్స్ చేస్తున్నారు.

ముఖ్యంగా సోషల్ మీడియా లో త్రివిక్రమ్ పూజ హెగ్డే మధ్య ఏం నడుస్తోంది అన్నట్లుగా మీమ్స్‌ తెగ క్రియేట్ చేస్తున్నారు.

ఆ మీమ్స్‌ లో కొన్ని అసభ్యకరంగా ఉన్నాయి.కొన్ని పర్వాలేదన్నట్లుగా ఉంటున్నాయి.

వరుసగా మూడవ సారి తన సినిమా లో పూజ హెగ్డే ను నటింపజేస్తున్నాడు త్రివిక్రమ్.

ఆయన గతంలో కూడా ఇలియానా సమంత లతో వరుస సినిమాల్లో వర్క్ చేసిన విషయం తెలిసిందే.

ఒక హీరోయిన్ తో అలవాటు పడ్డ తర్వాత వెంటనే మరో హీరోయిన్ తో సినిమా అంటే ఇబ్బంది.

"""/" / అందుకే ఎక్కువ శాతం నటీనటులను మరియు సాంకేతిక నిపుణులను త్రివిక్రమ్ కంటిన్యూ చేస్తూ ఉంటాడు.

అందులో భాగంగానే పూజా హెగ్డే ను అరవింద సమేత, అల వైకుంఠపురంలో నటింపజేసి ఇప్పుడు గుంటూరు కారం సినిమాలో( Guntur Karam Movie ) మహేష్ బాబు కి జోడిగా తీసుకున్నాడు అంటూ టాక్‌ వినిపిస్తుంది.

అంతే తప్పితే ఇద్దరి మధ్య ఏదో వ్యవహారం లేదని అంతకు మించి కథనాలు అల్లితే బాగోదు అంటూ త్రివిక్రమ్ అభిమానులు నేటిజన్స్ ని హెచ్చరిస్తున్నారు.

"""/" / అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా గుంటూరు కారం సినిమా ఉంటుందని మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఇది సరికొత్త అనుభూతిని కలిగించబోతుందని త్రివిక్రమ్ నమ్మకంగా ఉన్నాడు.

ఇక పూజ హెగ్డే విషయానికి వస్తే టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా ఈమెకి కాస్త కష్ట కాలం నడుస్తోంది.

అందుకే మహేష్ బాబు తో చేస్తున్న గుంటూరు కారం సినిమా సక్సెస్ అయితే మళ్లీ టాలీవుడ్ లో వరుసగా సినిమా ఆఫర్లు వస్తాయని అంతా భావిస్తున్నారు.

అందులో నిజం ఎంత తెలియాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

ఏ వయసు వారు ఎంత నీటిని తాగాలి.. పసిపిల్లలకు ఏ నెల నుంచి వాటర్ పట్టాలి..?